సర్పంచ్‌పై హైకోర్టు ఆగ్రహం.. ఆయన చేసిన తప్పేంటో తెలుసా..?

-

తాము ఇచ్చిన∙వినతిపత్రాలపై చర్యలు తీసుకొని, తమపై పెట్టిన క్రిమినల్‌ కేసులను కొట్టేయాలని ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట సర్పంచ్‌ గట్టు కుమారస్వామి ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా.. పిల్‌ దాఖలు చేసే ముందు ఈ అంశానికి సంబంధించి తమపై ఎలాంటి కేసులూ లేవని తప్పుడు అఫిడవిట్‌ ఎలా ఇస్తారని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఈ అంశంలో వ్యక్తిగత ప్రయోజనమే ఉంది.. ప్రజాప్రయోజనం ఏముందని ప్రశ్నించింది. తప్పుడు సమాచారం ఇవ్వడంతోపాటు కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు సంబంధిత పిటిషనర్‌కు ౖహైకోర్టు రూ.50 వేల జరిమానా విధించింది. కోర్టు విధించిన జరిమానా మొత్తం రెండు వారాల్లో న్యాయసేవా సాధికార సంస్థ ముందు డిపాజిట్‌ చేసి రసీదు సమర్పించాలని ఆదేశించింది, ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

ప్రభుత్వ భూమి ఆక్రమించారని..

లక్ష్మిదేవీపేటలో ప్రభుత్వ భూమిని ఎస్‌.మురళీధర్‌రావు అనే వ్యక్తి నిబంధనలు ఉల్లంఘించి ఆక్రమించుకున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా çపట్టించుకోలేదు. కేవలం మురళీధర్‌రావు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తమపై పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ కుమారస్వామి దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం విచారించింది. అయితే.. తీర్పును పునర్విచారించాలని కోరుతూ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేస్తామని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సుజాత పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news