కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీలకు హైకోర్టు నోటీసులు

-

కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీల నియామకం పై హైకోర్టులో పిల్ దాఖలు అయింది. ఈ నేపథ్యంలోనే.. విశ్రాంత ప్రిన్సిపల్ విద్యాసాగర్ పిల్ పై సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ జరిపారు.

నిబంధనలకు విరుద్ధంగా కేయూ, తెలుగు వర్సిటీ వీసీల నియామకం జరిగిందన్న పిటిషనర్… కాకతీయ వీసీకి పదేళ్ల అనుభవం లేదని తన వాదనలు హైకోర్టుకు వినిపించారు. తెలుగు వర్సిటీ వీసీకి 70 ఏళ్లు దాటాయని పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే.. దీనిపై వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, యూజీసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేయూ వీసీ రమేష్, తెలుగు వర్సిటీ వీసీ కిషన్ రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇక ఈ కేసు విచారణను అక్టోబరు 27కి వాయిదా వేసింది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news