లేటెస్ట్ టెక్నాలజీతో తెలంగాణలో పోలీసు పరీక్షలు

-

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే పోలీస్‌ శాఖలో ఉన్న ఖాళీల భర్తీకి సైతం నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. ఆసక్తిగల అభ్యర్థి దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఇటీవల దరఖాస్తులు ముగిసింది. త్వరలోనే పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే.. పోలీస్‌‌‌‌‌‌‌‌ పోస్టుల పరీక్షల నిర్వహణకు తెలంగాణ స్టేట్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌బోర్డ్‌‌‌‌‌‌‌‌(టీఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ) ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు7న ఎస్ఐ, 21న కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Telangana Police Recruitment 2021: Notification Released for Assistant  Public Prosecutor | INDToday

554 ఎస్ఐ, 15,644 కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌, 63 ట్రాన్స్ పోర్ట్, 614 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ను పూర్తిగా లేటెస్ట్ టెక్నాలజీతో నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆధునిక డిజిటల్ డివైజెస్‌‌‌‌‌‌‌‌ను సమకూర్చుకుంది. ఈ నెల 30 నుంచి ఎస్ఐ, ఆగస్ట్‌‌‌‌‌‌‌‌10 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించిన హాల్‌‌‌‌‌‌‌‌ టికెట్లను www.tslprb.in వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. లీగల్‌‌‌‌‌‌‌‌ సమస్యలు తలెత్తకుండా రిక్రూట్ మెంట్ బోర్డు చర్యలు తీసుకుంటోంది. నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌‌‌‌‌అయిన తర్వాత అప్లికేషన్‌‌‌‌‌‌‌‌, స్క్రూటినీ, హాల్‌‌‌‌‌‌‌‌ టికెట్లు, ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌, ఓఎంఆర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌షీట్స్‌‌‌‌‌‌‌‌,ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌ వరకు పక్కాగా ప్లాన్ చేస్తోంది. గతంలో మ్యాన్యువల్‌‌‌‌‌‌‌‌ విధానాల్ని అనుసరించడం వల్ల సెలక్షన్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌లో ఎన్నో అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. దీంతో 2018లో నిర్వహించిన ఎగ్జామ్స్ లో టెక్నాలజీని వాడారు. అభ్యర్థులు ఒకరి స్థానంలో మరొకరు ఎగ్జామ్ రాయకుండా, ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌లో ఇతరులు పాల్గొనే అవకాశం లేకుండా పూర్తిగా బయోమెట్రిక్ సిస్టమ్​ను అమలు చేస్తున్నారు.

ఎస్ఐ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌ కు రాష్ట్ర వ్యాప్తంగా 20, కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్స్ కు 40 పట్టణాల్లో సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సెంటర్‌‌‌‌‌‌‌‌ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన అభ్యర్థులు ఎగ్జామ్ హాల్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన వెంటనే బయోమెట్రిక్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌తో ఫింగర్‌‌‌‌‌‌‌‌ ప్రింట్స్‌‌‌‌‌‌‌‌ సేకరిస్తారు. అభ్యర్థుల అప్లికేషన్స్,ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్డ్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌సహా పూర్తి వివరాలను రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బోర్డ్‌‌‌‌‌‌‌‌ డేటా బేస్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేస్తారు. ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తారు. బయోమెట్రిక్‌‌‌‌‌‌‌‌ తర్వాతే అభ్యర్థులను గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి అనుమతిస్తారు. ప్రిలిమినరీ నుంచి ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌ వరకు మొత్తం 9 సార్లు బయోమెట్రిక్ నిర్వహిస్తారు. ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌లో చేతికి ఎలక్ట్రానిక్‌‌‌‌‌‌‌‌ బ్యాండ్‌‌‌‌‌‌‌‌ తగిలిస్తారు. అభ్యర్థి కదలిక చిప్‌‌‌‌‌‌‌‌ ద్వారా అధికారుల రాడార్‌‌‌‌‌‌‌‌లోకి చేరుతుంది. ఎన్ని ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌ లో అతడు పాల్గొన్నాడు, ఎంత టైమ్ ఖాళీగా ఉన్నాడు, గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఎక్కడెక్కడ తిరిగాడు ఇలా అభ్యర్ధికి చెందిన ప్రతి మూవ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ను ఆ చిప్ సాయంతో గుర్తిస్తారు అధికారులు.

 

Read more RELATED
Recommended to you

Latest news