హైదరాబాద్ లో హైటెన్షన్… చార్మినార్‌ వద్ద రేపు బీజేపీ ర్యాలీ ?

రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. పది వేల ఆర్థిక సహాయం ఆపడానికి కారణం బీజేపీ నేనని సీఎం కేసీఆర్ ఆరోపించడం అలాగే సంజయ్ పేరు మీద ఫేక్ లెటర్ సృష్టించి సోషల్ మీడియా లో సర్క్యులేట్ కావడంతో సీఎం కి భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర ప్రమాణం చేద్దామని నిన్న సంజయ్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే రేపటి బీజేపీ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేదని అంటున్నారు పోలీసులు. అనుమతి కావాలంటూ ఎవరు తమని కాంటాక్ట్ చేయలేదని చెబుతున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున  ఎలాంటి అనుమతులు ఇవ్వలేమని పోలీసులు చెబుతున్నారు.  అనుమతి లేకుండా చార్మినార్ వద్దకు వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. రేపు అక్కడ ఎటువంటి విషయాలు జరుగుతాయో ? అనే టెన్షన్ అందరిలో నెలకొంది.