రైతులు ఔషధ మొక్కలని పెంచాలంటే.. ఈ మొక్కలే బెస్ట్…!

-

రైతులు ఔషధ మొక్కలను పెంచితే అత్యధిక లాభం వస్తుంది. అయితే రైతులకు మూలికల పైన అవగాహన ఉండాలి అలానే పండించే భూమి పట్ల కూడా అవగాహన ఉండాలి. వాటిని కనుక తెలుసుకుంటే ఖచ్చితంగా అధిక ఆదాయాన్ని పొందొచ్చు. ఔషధ మొక్కల పెంపకం వల్ల రైతులు చక్కటి లాభాలను పొందటానికి అవుతుంది.

అయితే ఏ ఔషధ మొక్కల వల్ల మంచి లాభం వస్తుంది…?, ఏ మొక్కల వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది అనే దాని గురించి చూద్దాం. వీటిని పెంచడం వల్ల చక్కగా రేటు వస్తుంది. అలాగే ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. పండించడం కూడా చాలా సులభం. అయితే ఏ ఔషధ మొక్కలు పెంచుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆలస్యమెందుకు ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

తులసి:

తులసీ లో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. ఆయుర్వేద మందులు దీన్ని ఎక్కువగా వాడతారు. శతాబ్దాలుగా తులసిని కొలెస్ట్రాల్, తలనొప్పి, జలుబు, సైనస్ ఇలా చాలా రకాల సమస్యలకు వాడుతున్నారు. ఈ మొక్కల్ని పెంచడం వల్ల మీకు లాభాలు బాగుంటాయి.

అజ్మా:

ఇది మనీ ప్లాంట్ లాగ పెరుగుతుంది. ఈ మొక్కలు ప్రత్యక్ష సూర్యకాంతిని తట్టుకోగలవు. ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అలాగే అల్సర్ వంటి సమస్యలు కూడా తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ మొక్కలు కూడా మీరు పెంచి మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది.

కరివేపాకు:

వైద్యంలో శతాబ్దాలుగా దీన్ని ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. విరోచనాలు మలబద్ధకం వంటి వాటికి ఉపయోగపడుతుంది వికారం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. అలానే తీపి నిమ్మకాయ కూడా రైతులు వెయ్యచ్చు. అదేవిధంగా బిర్యాని ఆకు, పుదీనాని కూడా మీరు పెంచొచ్చు వీటివల్ల చక్కగా లాభాలని పొంది మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news