‘ హిజాబ్’ వివాదంపై కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. పొలిటికల్ గా రచ్చకు కూడా దారి తీసింది. ఇదిలా ఉంటే హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్ట్ లో విచారణ కొనసాగుతుంది. ఈరోజు కూడా కర్ణాటక హైకోర్ట్ లో వాడీవేడి వాదనలు జరిగాయి. అయితే ఈ వివాదంపై విచారణను రేపటికి వాయిదా వేస్తూ కోర్ట్ నిర్ణయం తీసుకుంది.
ఇటు పిటీషనర్ తరుపున న్యాయవాది.. అటు ప్రభుత్వం తరుపున న్యాయవాది రెండు వర్గాల వాదలనను హైకోర్ట్ విన్నది. కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో హిజాబ్ కు అనుమతి ఉందని పిటిషనర్ల తరుపు న్యాయవాది దేవధత్ కామత్ వాదించాడు. హిజాబ్ పై నిషేధం ఆర్టికల్ 25కి వ్యతిరేఖం అని పిటిషన్ల తరుపున కోర్టుకు విన్నవించారు. మరోవైపు హిజాబ్ ఇస్లాంలో తప్పనిసరా.. కాదా అని తేలాలని ప్రభుత్వం వాదనలను వినిపించింది. హిజాబ్ ధరించి ముస్లిం యువతులు స్కూళ్లకు రావడాన్ని అనుమతించాలని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. హిజాబ్ ధరించాలా వద్దా అనే నిర్ణయాన్ని కాలేజీ కమిటీలకు అప్పగించడం పూర్తిగా చట్టవిరుద్ధం అని దేవధత్ కామత్ కోర్టుకు విన్నవించారు.