దేశ వ్యాప్తంగా కరోనా నేపధ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే సడలింపులతో బయటకి రావడం మొదలుపెట్టారు. ప్రజలు ఆర్థికంగా కొలుకోడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. ఇలాంటి పరిస్థితులలో సామాన్యుడి నెత్తిపై మరో భారం మోపనుంది ప్రభుత్వం. ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే తాజాగా పెట్రోలు, డీజిల్ ధరలు మరో సారి పెరిగాయి. వరుసగా 13వ రోజు కూడా పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోలుపై 55 పైసలు, డీజిల్‌పై 63 పైసల చొప్పున పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 81.36, డీజిల్ రూ.75.31గా ఉంది. అమరావతిలో పెట్రోలు రూ. 81.76, డీజిల్ రూ.75.73గా ఉంది. ఢిల్లీలో పెట్రోలు రూ. 78.37, డీజిల్ రూ.77.06. ముంబైలో లీటరు పెట్రోలు రూ. 85.21, డీజిల్ రూ.75.53కి చేరుకుంది.