ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో గ్రీన‌రీ పెర‌గ‌లేదు : మంత్రి కేటీఆర్‌

-

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో పచ్చదనం పెరిగింది. సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అయితే.. తాజాగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ‌లో ప‌చ్చద‌నం 8 శాతం పెరిగిన‌ట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో గ్రీన‌రీ పెర‌గ‌లేద‌ని, తెలంగాణలో గ్రీన‌రీ పెరిగిన శాతం అత్య‌ధికంగా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. తెలంగాణ‌లో ప‌చ్చ‌ద‌నం మూడు శాతం పెరిగిన‌ట్లు గ్రీన్ బెల్ట్ అండ్ రోడ్ ఇన్స్‌టిట్యూట్ ప్రెసిడెంట్ ఎరిక్ సోల్‌హెమ్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో తెలంగాణ‌ స‌ర్కార్ చేప‌డుతున్న హ‌రిత‌హారాన్ని ఆయ‌న ప్ర‌శంసించారు. తెలంగాణ త‌న గ్రీన‌రీని మూడు శాతం పెంచుకుంద‌ని, ఇదో అద్భుత‌మైన ప‌య‌త్నమ‌ని ఆయ‌న అన్నారు. ఎరిక్ త‌న ట్వీట్‌లో ఓ వీడియో పోస్టు చేశారు. ఇలాంటి హై క్వాలిటీ ఉన్న మొక్క‌ల్ని నాట‌డ‌డం వ‌ల్లే ఆ గ్రీన‌ర్ పెరిగిన‌ట్లు ఎరిక్ త‌న ట్వీట్‌లో అభిప్రాయ‌ప‌డ్డారు. ఆరోగ్య‌క‌ర‌మైన మొక్కల్ని మ‌ళ్లీ ఈ సీజ‌న్‌లోనూ నాటేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉన్న‌ట్లు ఎరిక్ త‌న ట్వీట్‌లో తెలిపారు.

KTR questions Central agencies absence after BJP MLA's claim

అయితే గ్రీన్ బెల్ట్ ప్రెసిడెంట్ ఎరిక్ చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. మూడు శాతం కాదు, నిజానికి తెలంగాణ‌లో 8 శాతం గ్రీన‌రీ పెరిగిన‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలోనే ఇది హ‌య్యెస్ట్ అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని సుమారు 12,769 గ్రామాల్లో, 142 మున్సిపాల్టీల్లో న‌ర్స‌రీలు(Nurseries) ఉన్నాయ‌ని, అన్ని న‌ర్స‌రీలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మే అని మంత్రి తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా 16,000 న‌ర్స‌రీలు ఉన్న‌ట్లు మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news