మహా విష్ణువు ఒక్కో జన్మలో ఒక్కో అవతారం ఎత్తారు..అందులో రామాయణం కు చాలా ప్రత్యేకత ఉంది.స్త్రీ కోసం యుద్ధం జరిగింది.అందుకే ఈ రామాయణం లో స్త్రీ పాత్రకు ప్రాముఖ్యత ఉంది.జనకమహారాజు కూతురు అయిన సీతాదేవి స్వయంవరంలో శివధనస్సును ఎక్కు పెట్టి సీతా దేవిని శ్రీరాముడు వివాహం ఆడిన సంగతి తెలిసిందే..సీత చెల్లెలైన ఊర్మిళాదేవికి రాముడి తమ్ముడైన లక్ష్మణుడు కూడా వివాహం జరుగుతుంది. పెళ్లయిన కొద్ది రోజులకే జనకమహారాజు శ్రీరామచంద్రుని అరణ్యవాసం చేయాల్సిందిగా కోరుతాడు.
తండ్రి మాట కోసం రాముడు అడవులకు వెళతాడు.శ్రీరాముడు ఎక్కడుంటే సీతాదేవి కూడా అక్కడే ఉంటుందని తెలియజేసి అరణ్యవాసం వెళ్ళడానికి బయలుదేరుతారు. అప్పుడు అన్నా, వదిన రక్షణ కోసం తాను కూడా అరణ్యవాసం వెళ్తానని లక్ష్మణుడు వారి వెంట బయలుదేరుతాడు. అప్పుడు ఊర్మిళాదేవి కూడా తనతోపాటు వస్తానని చెప్పగా అందుకు లక్ష్మణుడు ఇక్కడే ఉండి తన తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాలని కోరతాడు.భర్త వచ్చే వరకూ తానూ బయట ఎవరిని చూడను అని నిద్రలోకి వెళుతూంది.
ఏకంగా 14 సంవత్సరాల నిద్రలోనే గడుపుతారు.. అరణ్యంలో సీతారాములకు రక్షణగా ఉన్న లక్ష్మణుడికి నిద్ర వస్తుండడంతో తన బాధ్యతకు ఎలాంటి ఆటంకం కలగకుండా, తనకు 14 సంవత్సరాల పాటు నిద్ర రాకుండా విడిచిపెట్టమని ఆ నిద్ర దేవతను వేడుకుంటాడు. అయితే నిద్ర ప్రకృతి ధర్మమని తనకు రావాల్సిన నిద్ర మరెవరికైనా పంచాలని కోరడంతో,తన 14 సంవత్సరాల పాటు నిద్రను తన భార్య ఊర్మిళాదేవికి ప్రసాదించమని లక్ష్మణుడు నిద్రాదేవతను కోరుతాడు. దాంతో ఊర్మిల నిద్ర లోనే ఉంటుంది. వాళ్ళు తిరిగి రాజ్యానికి వచ్చినపుడు మెలుకువలోకి వస్తుంది..రామాయణం లో ఊర్మిళాదేవి నిద్ర కూడా ఒక కీలక అంశం..అన్న మాటను తప్పని తమ్ముడు..భర్త మాటను జవదాటని భార్యలు..అలా రామాయణ కథ సాగుతుంది..