HIT2 : అడవి శేష్.. హిట్‌ -2 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

-

విభిన్న క‌థాంశాల‌ను ఎంచుకుని భారీ హిట్ లు కొట్టే అడివి శేషు మ‌రోసారి సరి కొత్త క‌థ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ HIT 2 సినిమా లో కేడీ అనే పోలీసు అధికారి గా అడ‌వి శేష్ క‌నిపించ నున్నాడు. అయితే గ‌తం లో HIT అనే సినిమా తో యువ క‌థ‌నాయ‌కుడు విశ్వ‌క్ సేన్ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి.. మంచి హిట్ అందుకున్నాడు.

దీంతో ఈ సినిమా కు సిక్వెల్ గా HIT 2 ను తీస్తున్నారు. కాగా ఈ సినిమా ను విశాఖప‌ట్నం నేప‌థ్యం లో తీశారు. ఇప్ప‌టి కే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది.విశ్వ‌క్ సేన్ హిట్ సినిమా కు ద‌ర్శ‌కత్వం వ‌హించిన శైలేష్ కొల‌ను ఈ సినిమా కు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. జూలై 29 వ తేదీన హిట్‌ 2 మూవీని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను కూడా వదిలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version