HIT2 Trailer : హిట్ 2 ట్రైలర్ రిలీజ్‌..చుక్కలు కనిపించాల్సిందే !

-

విభిన్న క‌థాంశాల‌ను ఎంచుకుని భారీ హిట్ లు కొట్టే అడివి శేషు మ‌రోసారి సరి కొత్త క‌థ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ HIT 2 సినిమా లో కేడీ అనే పోలీసు అధికారి గా అడ‌వి శేష్ క‌నిపించ నున్నాడు. అయితే గ‌తం లో HIT అనే సినిమా తో యువ క‌థ‌నాయ‌కుడు విశ్వ‌క్ సేన్ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి.. మంచి హిట్ అందుకున్నాడు.

దీంతో ఈ సినిమా కు సిక్వెల్ గా HIT 2 ను తీస్తున్నారు. కాగా ఈ సినిమా ను విశాఖప‌ట్నం నేప‌థ్యం లో తీశారు. ఇప్ప‌టి కే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. విశ్వ‌క్ సేన్ హిట్ సినిమా కు ద‌ర్శ‌కత్వం వ‌హించిన శైలేష్ కొల‌ను ఈ సినిమా కు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఇక ట్రైలర్‌ చాలా భయానకంగా ఉంది. టీజర్‌ ను మించిపోయేలా హిట్‌ 2 ట్రైలర్‌ ఉంది. హంతకుడు చేసే మర్డర్లను చాలా భయనకంగా చూపించారు. కాగా ఈ సినిమా డిసెంబర్‌ 2న రిలీజ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version