అరటి ఆకులో అన్నం తింటుంటే భలే ఉంటుంది కదండీ..పింగాని ప్లేట్స్, వెండి కంచాలు ఏం సరిపోతాయ్ అసలు. అరటి చెట్టు నుంచి వచ్చే ప్రతీది మనకు మేలు చేసేదై ఉంటుంది.. అటు అరటి కాయతో కూర, అరటి పండు తింటాం, అరటి తొక్కతో పళ్లు రద్దుకోవచ్చు, ఫేస్‌కు కూడా అప్లై చేసుకోవచ్చు. మంచి ఫలితం ఉంటుంది. అరటి ఆకును తినడానికి డెకరేషన్ చేయడానికే కాకుండా ఇంకా చాలా విధాలుగా వాడుకోవచ్చు. మంచి మంచి ఫలితాలు వస్తాయండోయ్.! అవేంటంటే..
అరటి ఆకుల్లో లిగ్నిన్, అల్లాంటోయిన్, హెమిసెల్యులోజ్, పాలీఫెనాల్స్, ప్రొటీన్లు వంటి అద్భుతమైన పోషకాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. మీకు గొంతు సమస్య ఉంటే అరటి ఆకును ఒక గ్లాసు నీళ్లలో వేసి మరిగించండి. దీన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
అరటి ఆకు నీరు చర్మంలోని బ్యాక్టీరియాను చంపుతుంది, కాబట్టి అరటి ఆకు నీటిని రోజూ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, మృదువుగా ఉంటుంది. అరటి ఆకు చర్మ సౌందర్యానికి మాస్క్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే మైక్రో ఇన్‌ఫ్లమేషన్‌ను నివారించడంలో అరటి ఆకు సహాయపడుతుంది, ఇది డిమెన్షియా, క్యాన్సర్ మొదలైన వ్యాధులతో పోరాడుతుంది. ముడతలు, వృద్ధాప్య సంకేతాలను తొలగిస్తుంది. ఇది మొటిమలు, నల్ల మచ్చలను కూడా నివారిస్తుంది.
ఎండిన అరటి ఆకులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇది ALLANTOIN అనే పదార్ధం. గొంతు నొప్పిని సులభంగా నయం చేయడానికి సహాయపడే ఈ పదార్ధం కారణంగా అరటి ఆకులు రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా ఉపయోగడపడతాయి. అసలే ఈరోజుల్లో రోగనిరోధక శక్తి ఎంత అవసరమో మనందరికీ తెలుసు.
అరటి ఆకులలో ఉండే అధిక అల్లాంటోయిన్ జుట్టు సహజ రంగును పొందడానికి, దురద స్కాల్ప్ సమస్యకు చక్కటి పరిష్కారం కలిగిస్తుంది. చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని అరటి ఆకులను గ్రైండ్ చేసి హెయిర్ మాస్క్‌ను తయారు చేసి మీ జుట్టుకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. అలాగే తాజా అరటి ఆకులను తేనెతో కలిపి పేస్ట్ చేసి గాయంపై పూస్తే గాయం మానుతుంది. జ్వరం వచ్చినప్పుడు అరటి ఆకులో నూనె రాసి తలకు పట్టిస్తే ఉపశమనం ఉంటుంది.
ఇంట్లో అరటి చెట్టు ఉంటే ఎన్ని విధాలుగా అయినా వాడుకోవచ్చు. ఈసారి అరటి ఆకులు దొరికితే అస్సలు వేస్ట్ చేయకండి మరీ..!
Attachments area