పనికిమాలిన BRS మీటింగులకు పర్మిషన్ ఎలా ఇస్తారు? – వైఎస్ షర్మిల

-

నేడు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో వైరా నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం బిఆర్ఎస్ నేతృత్వంలో జరిగింది. ఈ సమ్మేళనం ప్రారంభానికి ముందు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. దీంతో ఆ నిప్పురవ్వలు ఓ గుడిసెపై పడి నిప్పు అంటుకుంది. దీంతో ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 8 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.

“ఖమ్మం జిల్లా చీమలపాడులో బాణాసంచా పేలిన దుర్ఘటన తీవ్రంగా కలిచివేసింది.అమాయాకులతో పాటు పోలీసులు, జర్నలిస్టులకు తీవ్రగాయాలు కావడం బాధాకరం. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50లక్షలు, ఒక ప్రభుత్వ ఉద్యోగం, క్షతగాత్రులకు రూ.20లక్షల పరిహారం, మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నా. ప్రతిపక్షాల న్యాయమైన డిమాండ్ల సమావేశాలకు అనుమతులు ఇవ్వని పోలీసు పెద్దలు, పనికిమాలిన BRS మీటింగులకు ఎలా పర్మిషన్లు ఇస్తారు? మండుటెండలో బాణాసంచా పేలుస్తుంటే ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద ప్రమాదం జరిగినా మీటింగ్ కు, ప్రమాదానికి సంబంధం లేదని బీఆర్ఎస్ ఎంపీ సిగ్గులేకుండా చెబుతున్నాడు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version