క్రెడిట్ కార్డు తీసుకోవాలా..? అయితే సరైన క్రెడిట్ కార్డును ఎలా ఎంపిక చేసుకోవాలో చూద్దాం..!

-

మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? క్రెడిట్ కార్డు ని ఈ మధ్య కాలం లో ఎక్కువ మంది వాడుతున్నారు క్రెడిట్ కార్డు వలన ఎన్నో లాభాలు వున్నాయి. అయితే నష్టాలు కూడా ఉంటాయి. క్రెడిట్ కార్డులపై రివార్డ్ పాయింట్లు, మినహాయింపులు, క్యాష్ బ్యాక్ ఇలా చాలా ప్రయోజనాలు వుంటుంటాయి. వీటన్నింటినీ ఎలా ఉపయోగించుకోవాలో క్రెడిట్ కార్డు వున్నవాళ్లు తెలుసుకోవాలి.

క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే కొన్ని అర్హతలు అవసరం అవుతాయి. కార్డు కోసం చాలా వరకు ఆదాయం చూస్తాయి. క్రెడిట్ రిపోర్ట్ కూడా కావాలి. అలానే కార్డు తీసుకునే ముందు అర్హతలకు తగ్గట్లు అందులో ఉన్న బెస్ట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అర్హతకు సరిపోని కార్డును అప్లై చేసుకున్నా అది రిజెక్ట్ అవుతుంది. అప్పుడు మీ క్రెడిట్ స్కోరు పైన ఎఫెక్ట్ పడుతుంది.

ఉదాహరణకు షాపింగ్ ఎక్కువగా చేసేవారు ఉంటే షాపింగ్, ఆన్‌లైన్ ఆఫర్స్ వుండే కార్డుని ఎంపిక చేసుకోవాలి. కార్లు, బైక్స్‌పై ప్రయాణించి వారైతే ఫ్యూయెల్ కార్డును ఎంచుకోవాలి. ఇలా అవసరాలకు తగ్గట్లు ఎంచుకోవాల్సి వుంది. క్రెడిట్ లిమిట్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే మీరు కార్డు ని ఎంపిక చేసుకునే ముందు క్రెడిట్ లిమిట్ ఎక్కువగా వుండే వాటిని తీసుకోవాలి.

కానీ లిమిట్ మొత్తం ఖర్చు చేయకూడదు. బడ్జెట్‌కు అనుగుణంగా ప్రతి నెలా క్రెడిట్ కార్డుపై ఎంత ఖర్చు పెట్టాలనేది చూడండి. ఇలా కనుక మీరు మీ క్రెడిట్ కార్డు ని ఎంపిక చేసుకుంటే ఏ సమస్స్యా ఉండదు. క్రెడిట్ కార్డు తో చక్కటి బెనిఫిట్స్ ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version