ఏపీ బాండ్ల వేలానికి అనూహ్య స్పంద‌న

-

లిక్క‌ర్ ఆదాయం ఆధారంగా ఏపీ ప్ర‌భుత్వం జారీ చేస్తున్న బాండ్ల వేలానికి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. ఏపీ ప్ర‌భుత్వం అధిక వ‌డ్డీ ఇవ్వ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించ‌డంతో పారిశ్రామిక దిగ్గ‌జాల‌తో పాటు కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లు కూడా ఈ వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్న‌ట్లుగా స‌మాచారం. ఇప్ప‌టికే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (ఈపీఎఫ్ఓ) స‌హా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కూడా ఈ బాండ్ల వేలంలో పాల్గొనేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది.

Bond auction, slated for March 26, cancelled over yield concerns -  BusinessToday

ఉద్యోగుల భ‌విష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఏకంగా రూ.5,080 కోట్లను పెట్టుబడిగా పెట్టి ఏపీ లిక్క‌ర్ బాండ్ల‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధ‌ప‌డింద‌న్న వార్త‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. అలాగే, ఇంకా ఈ బాండ్ల‌ను కొనుగోలు చేసేందుకు ఆదిత్య బిర్లా, మోర్గాన్ స్టాన్లీ, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ స‌హా 26 సంస్థ‌లు ఆస‌క్తి చూపుతున్న‌ట్లుగా స‌మాచారం. వెర‌సి లిక్క‌ర్ బాండ్ల ద్వారా ఏపీ ప్ర‌భుత్వం భారీ ఎత్తున నిధుల‌ను స‌మ‌కూర్చుకునే అవ‌కాశం ఉంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news