టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ నటించిన చిత్రాలు ఇటీవల కాలంలో వరుసగా బోల్తా కొడుతున్నాయి. కరోనా కాలంలో విడుదలైన ‘క్రాక్’ ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంది. కానీ, ఆ తర్వాత కాలంలో వచ్చిన ‘ఖిలాడీ’, ‘రామారావు..ఆన్ డ్యూటీ’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ క్రమంలోనే రవితేజ నటించిన చిత్రం ‘ధమాకా’పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా అయినా రవితేజకు హిట్ గా నిలుస్తుందా? లేదా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. అయితే, తాజాగా విడుదలైన ‘జింతాక్’ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కమర్షియల్ గా ఈ పిక్చర్ డెఫినెట్ గా ఆకట్టకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రవితేజకు జోడీగా ఇందులో హీరోయిన్ గా ‘పెళ్లి సందD’ ఫేమ్ శ్రీలీల నటించింది.
త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాలు గతంలో అన్నీ బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. ఈ క్రమంలోనే ఈ పిక్చర్ ద్వారా రవితేజ ఖాతాలో బ్లాక్ బాస్టర్ పడుతుందని సినీ అభిమానులు అంటున్నారు. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పైన అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తు్న్నారు.
రవితేజ గత చిత్రాలు ‘ఖిలాడీ’, ‘రామారావు.. ఆన్ డ్యూటీ’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. కాగా, ఈ చిత్రం మాత్రం అంచనాలను మించి ఉంటుందని మాస్ మహారాజ రవితేజ అభిమానులు చెప్తు్న్నారు.
ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే రవితేజ పాన్ ఇండియా ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’తో పాటు ‘రావణాసుర’ సినిమాలు చేయనున్నారు.