హైదరాబాద్ లో భారీ పేలుడు..ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి

-

హైదరాబాద్ లో భారీ పేలుడు సంభవించింది. హైదరాబాద్‌ లోని సనత్‌ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. ముసాపేట హెచ్.పీ రోడ్ లోని స్క్రాప్ గోదాం లో పేలుడు జరుగగా…ఈ పేలుడు దాటికి తీవ్ర గాయాల పాలైన వ్యక్తి, మృతి చెందాడు.

కెమికల్స్ ఖాళీ డబ్బలను… టాటా ఏస్ వాహనం లో లోడ్ చేస్తుండగా కెమికల్ ఉన్న డబ్బా వాహనంపై నుండి కింద పడిపోయింది. ఈ తరుణంలో.. ఈ పేలుడు జరిగి… ఆ వ్యక్తి మరణించాడు. ఎస్ ఐ చంద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం ముషీరాబాద్ బోలక్ పూర్ కు చెందిన మహమ్మద్ నజీర్ స్క్రాబ్ కొనుగోలు చేస్తుంటారు. ఎప్పటి లాగే, ఇవాళ ముసాపేట ప్రాంతంలో డబ్బలను లోడ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా క్రింద పడిపోయింది. దీంతో నజీర్ కు బలమైన గాయాలు అయి..మరణించాడని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news