ఎవడన్న కట్టుకున్న భార్యను ఓరకంట చూస్తేనే భరించలేని భర్తలు ఉన్న సమాజంలో.. ఓ దుర్మార్గుడు ఏకంగా తన భార్య నగ్న వీడియోలు షేర్ చేసేందుకు సిద్ధమయ్యాడు. శృంగారం చేస్తుండగా తీసిన వీడియోలు బయటపెడుతానంటూ బెదిరింపులకు దిగాడు. తన భార్య మరోకరితో శృంగారం చేస్తుండగా కాదు.. తనతోనే విచిత్ర భంగిమల్లో శృంగారం చేసి వీడియోలు తీసి చివరకు ఆ వీడియోలు బయటపెడుతానంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగారు ఓ రాక్షస భర్త. ఈ నేపథ్యంలో.. అసహజ శృంగారానికి పాల్పడడమే కాకుండా, వీడియోలు తీసి కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తున్న భర్తపై అతడి భార్య(30) పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కోటి రూపాయలు ఇవ్వకుంటే తన నగ్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదరిస్తున్నాడంటూ లసుడియా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత భార్య పేర్కొంది. తన అత్తమామలు కూడా అతడికే మద్దతు పలుకుతున్నారని, అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపిస్తూ వారిపైనా కేసు పెట్టింది. కాగా, బాధిత మహిళ భర్త కాన్పూరుకు చెందిన వాడు కావడంతో ఇండోర్ పోలీసులు ఈ కేసును అక్కడికి బదిలీ చేశారు. కాగా, బాధిత మహిళ భర్త రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అని పోలీసులు తెలిపడం గమనార్హం.