ఒకరి ప్రాణాలు తీసిన చికెన్‌.. ఎక్కడంటే..

-

సమాజంలో రోజు రోజుకు పైశాచికత్వం పెరిగిపోతోంది. చిన్న చిన్న కారణాలకు కూడా ప్రాణాలు తీస్తూ.. క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అందులోనూ భార్యాభర్తల మధ్య తలెత్తే మనస్పర్ధలు కాస్త.. హత్యల వరకు వెళ్తున్నాయంటే.. జనాల్లో శాడిజం ఎంత పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కూర్చొని మాట్లాడుకుని.. ఒకరినొకరు అర్థం చేసుకుంటే సమస్య పరిష్కారమయ్యేదానికి.. క్షణికావేశాల్లో తీసుకోరాని నిర్ణయాలు తీసుకుంటూ కొందరు తమ విలువైన ప్రాణాలు తీసుకుంటుంటే.. మరికొంత మంది ఎదుటు వారి ప్రాణాలు తీస్తున్నారు. అది కూడా చిన్నచిన్న కారణాలకే కావటం శోచనీయం. అలాంటి ఘటనే మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండలంలోకి కిష్టంపేట గ్రామంలో చోటుచేసుకుంది. చికెన్ వండలేదన్న కోపంతో భార్యను అతికిరాతకంగా హతమార్చాడు ఓ భర్త.

రాత్రికి చికెన్ కూర వండాలని చెబితే.. వంకాయ కూర వండిందని కోపానికి వచ్చిన ఆ భర్త. గొడ్డలితో భార్య మీద దాడి చేసి హత్య చేశాడు. నిద్రిస్తున్న సమయంలో దాడి చేయడంతో గాలిపెల్లి శంకరమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను చంపిన భర్త గాలిపెల్లి పోశం అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం వెలుగు చూడడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు..కాగా, మార్చిలో ఇలాంటి ఘటనే ఏపీలోని ఒంగోలు లో వెలుగు చూసింది. క్షణికావేశం నిండు కుటుంబాన్ని ఒక్క రాత్రి లో తలకిందులాగా చేసింది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన కలహాలు.. తద్వారా క్షణికావేశం ఇద్దరు చిన్నారులను అనాధలుగా మార్చేసింది. డాకా అంజిరెడ్డి,పూర్ణిమ దంపతులు. చిన్న గొడవ జరగడం తో భార్యను కోట్టి చంపాడు.. భార్య చనిపోయిందని తెలియగానే అతను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. పిల్లలు అనాధలుగా మారారు..క్షణికావేశంలో తొందర పడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version