హుజురాబాద్ నియోజక వర్గం మరియు బద్వేల్ నియోజక వర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హుజురాబాద్ నియోజక వర్గ ఉప్ప ఎన్నిక పోలింగ్ లో ఇవాళ మధ్యాహ్నం 1 గంట వరకు 45.63 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అటు బద్వేల్ ఉప ఎన్నిక లోనూ మధ్యాహ్నం ఒంటి గంట వరకు 35.47 శాతం పోలింగ్ నమోదు అయింది. చిన్న సంఘటన మినహా… రెండు ఉప ఎన్నికలు చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.
అయితే..కాసేపటి క్రితమ….జమ్మికుంట మండలం హిమ్మత్ నగర్ కి వచ్చారు బీజేపీ నేత తుల ఉమ. ఈ నేపథ్యం లోనే టీఆర్ఎస్ మరియు బీజేపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అంతేకాదు… గో బ్యాక్ అంటూ టీఆర్‌ఎస్ పార్టీ నేతలు నినాదాలు కూడా చేశారు. తుల ఉమ నాన్ లోకల్ అని.. ఆమెని ఎన్నికల అధికారులు ఇక్కడ ఎలా ఉండనిచ్చారని మండిపడ్డారు టీఆర్‌ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్. పోలీసులు ఎం చేస్తున్నారని… అవాంచనీయ ఘటనలు జరిగితే… పోలీసులే బాధ్యులు అని ఫైర్ అయ్యారు. నాన్ లోకల్ వాళ్ళు ఉండి భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు.