హుజూరాబాద్‌ క్లైమాక్స్ ఫైట్: మారిన కుల సమీకరణాలు..లీడ్ ఎవరిదంటే?

-

హుజూరాబాద్ ఉపఎన్నిక పోరు చివరి దశకు వచ్చేసింది…ఇంకా ఎన్నికకు సరిగ్గా మూడు రోజుల సమయం కూడా లేదు..ఈలోపు ఎవరికి వారు…తమ గెలుపోటములపై లెక్కలు వేసేసుకుంటున్నారు. ఆ మండలంలో తమకు ఇన్ని ఓట్లు పడతాయి…ఈ కులం వాళ్ళు తమకే ఓటు వేస్తారని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. అయితే మొదట్లో ఉన్న పరిస్తితి ఇప్పుడు కనిపించడం లేదు. దళితబంధు పథకం ఎఫెక్ట్ వల్ల కుల సమీకరణాలు బాగా మారిపోయాయని తెలుస్తోంది.

Huzurabad | హుజురాబాద్

ఇప్పుడు ఏ కులం పూర్తిగా మద్ధతుగా ఉన్నదో క్లారిటీ రావడం లేదు…రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం…కుల సమీకరణాలని చూసుకుంటే…మెజారిటీ వర్గాల మద్ధతు ఈటల రాజేందర్‌కే ఉందని తెలుస్తోంది. అయితే కులాల వారీగా ఎవరి మద్ధతు ఎవరికి ఎక్కువగా ఉందనే విషయాన్ని ఒక్కసారి గమనిస్తే…మెజారిటీ దళితులు టీఆర్ఎస్ వైపే ఉన్నారని తెలుస్తోంది. దళితబంధు ఎఫెక్ట్‌తోనే ఈ పరిస్తితి ఉందని చెప్పొచ్చు. ఇక క్రిస్టియన్, ముస్లిం ఓటర్లు సైతం టీఆర్ఎస్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కాంగ్రెస్ వైపు…వీరు బీజేపీకి ఎక్కువ మద్ధతు లేరని తెలుస్తోంది.

అటు టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్… యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ వర్గం కూడా టీఆర్ఎస్ వైపే ఎక్కువ ఉంది. ఇక వెలమ సామాజికవర్గం ఎలాగో టీఆర్ఎస్ వైపే ఉంటుంది. ఇక ఈటల వైపు చూస్తే గౌడ, పద్మశాలి, ముదిరాజ్, మున్నూరు కాపు, రెడ్డి ఓటర్లు ఉన్నారు. వీరు ఈటలకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఇతర బీసీ కులాలు, వైశ్య-బ్రాహ్మణ కులాలు కూడా ఈటల వైపే ఉన్నారని తెలుస్తోంది. అంటే హుజూరాబాద్‌లో సగం బీసీ ఓట్లే…వారు మెజారిటీ ఈటల వైపు. ఆ తర్వాత ఉన్న దళితులు టీఆర్ఎస్ వైపు…నెక్స్ట్ రెడ్డి వర్గం ఈటల వైపు. అంటే మొత్తం మీద చూసుకుంటే ఈటలకే సపోర్ట్ ఎక్కువ కనిపిస్తోంది…అంటే లీడ్ ఈటలదే అని తెలుస్తోంది. మరి చూడాలి ఎన్నికలో ఏం అవుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version