ఉద్యోగం పేరుతో హోంగార్డుకు ఎర.. రూ.27 లక్షల టోకరా

-

ఉద్యోగాల పేరుతో కొందరు కేటుగాళ్లు పన్నుతున్న వలలో నిరుద్యోగులే కాదు, ఉద్యోగులు కూడా పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్​లో చోటుచేసుకుంది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు ఓ హోంగార్డు వద్ద రూ.27.50లక్షలు తీసుకొని మోసం చేశారు.’

‘న్యూబోయిన్‌పల్లి పోలీస్‌ క్వార్టర్స్‌లో ఉండే హోంగార్డు అంతయ్య(37)కు రెండేళ్ల కిందట నకిరేకల్‌కు చెందిన భగ్‌వాన్‌దాస్‌తో పరిచయమైంది. గతేడాది ఫిబ్రవరిలో తన సహచర విద్యార్థి అంటూ మంగులాల్‌ను భగ్‌వాన్‌దాస్‌ అంతయ్యకు పరిచయం చేశాడు. మంగులాల్‌ రైల్వేలో పనిచేస్తున్నాడని, ఉద్యోగాలు ఇప్పిస్తాడని చెప్పాడు. అది నమ్మిన అంతయ్య తన భార్య గీతకు కమర్షియల్‌ టాక్స్‌ అధికారి(సీటీవో), బంధువు కవితకు జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు ఇప్పించాలని కోరాడు.

ఇందుకు భగ్‌వాన్‌దాస్‌ అడిగినప్పుడల్లా విడతలవారీగా మంగులాల్‌ బ్యాంకు ఖాతాలో రూ.27,50,000 జమచేశాడు. ఉద్యోగాల విషయం అడిగినప్పుడల్లా నిందితులు దాటవేస్తూ వచ్చారు. అనుమానం వచ్చి విచారించగా.. మంగులాల్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తుండడంతో ఆరు నెలలక్రితమే విధుల్లోంచి బహిష్కరించినట్లు తెలిసిందని’ పోలీసులు చెప్పారు. తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news