వాహనదారులకు బిగ్ అలెర్ట్.. నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్స్ ఆంక్షలు

-

హైదరాబాద్‌ వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌…ఇవాళ హైదరాబాద్‌ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. పరేడ్ గ్రౌండ్లో జరుగు భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. HICC మాదాపూర్ – జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ – రాజ్ భవన్ – పంజాగుట్ట – బేగంపేట్ ఎయిర్పోర్ట్ – పరేడ్ గ్రౌండ్ మరియు పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల రోడ్లలో ప్రయాణించడం నివారించాలని… టివోలి X రోడ్ నుండి ప్లాజా X రోడ్ మధ్య రహదారి మూసివేయబడుతుంది.

సికింద్రాబాద్ పరిధిలోని పలు జంక్షన్ లలో తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం ఉండవచ్చునని పేర్కొన్నారు పోలీసులు. ఇవాళ మ.2 గంటల నుండి 11 గంటల మధ్య MG రోడ్, RP రోడ్ మరియు SD రోడ్లలో మరియు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ నుండి 3 కిలోమీటర్ల పరిధిలోని అన్ని జంక్షన్లు/రోడ్లలో ప్రయాణాలను నివారించాలని ప్రజలకు వివరించారు పోలీసులు.

సాధారణ ప్రజల కోసం ట్రాఫిక్ మళ్లింపులు:
1.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్ళు ప్రయాణికులకు మార్గాలు:
ఆ) పంజాగుట్ట వైపు నుండి ఖైరతాబాద్, ఆర్ టి సి X రోడ్, మీదుగా చిలకలగూడ నుండి ప్లేట్ ఫారం 10 ద్వారా ప్రవేశించగలరు.
బి) ఉప్పల్ వైపు నుండి నారాయణగూడ, ఆర్ టి సి X రోడ్, మీదుగా చిలకలగూడ నుండి ప్లేట్ ఫారం 10 ద్వారా ప్రవేశించగలరు.
సి) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళు వారు ప్యాటినీ, పారడైస్, బేగంపేట్ దారులను నివారంచండి.
2.కరీంనగర్, నిజామాబాదు వైపు నుండి వచ్చే వాహనాలు ఔటర్ రింగ్ రోడ్ నుండి వేరే మార్గాల ద్వారా హైదరాబాద్ నగరం లోకి ప్రవేశించగలరు.
3.ఉప్పల్ వైపు నుండి పంజాగుట్ట/అమీర్పేట్ వెళ్ళు ప్రయాణికులు తార్నాక, రైలునిలయం రోడ్ ను నివారించి ఆర్.ట్.సి. X రోడ్ నుండి లక్డికాపూల్ నుండి వెళ్ళగలరు.
4.మేడ్చల్, బాలానగర్, ఖార్ఖనా, తిరుమలగిరి నుండి సికింద్రాబాద్ వైపు వెళ్ళు ప్రయాణికులు నేరెడిమేట్, మల్కాజ్ గిరి వైపు నుండి వెళ్ళగలరు.ప్రయాణికులందరూ తమ ప్రయాణాన్ని ముందుగా లేధా పైన సూచించిన సమయానుసారం ప్లాన్ చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news