వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే.తాజాగా ఆయన మాట్లాడుతూ పులివెందులలో తనకు రక్షణ కరువైందని, తనకు భద్రత కల్పించాలని కోరారు.తన భద్రత కోసం ఇద్దరు పోలీసులను కేటాయించమని పోలీసు శాఖ చెబుతోందని, అయినప్పటికీ తన ఇంటి వద్ద వారెవరూ కాపలా ఉండడం లేదని చెప్పారు.తాను ఇంటి నుంచి బయటకు వెళ్ళే ప్రతీ సారీ సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ కు ఫోన్ సంబరాలు చెప్పాలంటే కష్టం అవుతుంది అన్నారు.పులివెందులలో బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుందని చెప్పారు.
సెక్యూరిటీ లేకపోవడం వల్ల తన పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని…తనకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.కాగా 2021 ఆగస్టు 30న వైయస్ వివేకా హత్య జరిగిన తీరును వివరిస్తూ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు.దస్తగిరి కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ను మిగతా నిందితులను లాయర్లకు కోర్టుచ్చింది.దస్తగిరి తన కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ లో బడా నేతల పేర్లను ప్రస్తావించారు.వివేకా హత్య లో తనతోపాటు నలుగురు పాల్గొన్నట్టు దస్తగిరి అంగీకరించాడు.