తెలంగాణలో ఘనంగా జరిగిన తొలి ‘గే’ల వివాహం

ఇద్దరు పురుషులు, ఇద్దరు మహాళలు పెళ్లి చేసుకున్న దాఖలాలు మన దేశం లోనే లేవు. అయితే మొట్ట మొదటి సారిగా తెలంగాణ రాష్ట్రం లో ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్ల క్రితం డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన సుప్రియే, అభయ్ లు.. మొదట గా స్నేహితులుగా మెలిగారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఉన్న స్నేహం.. ప్రేమగా మారింది.

ఇప్పుడు వారిద్దరూ పెద్దల అనుమతితో అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేసుకున్నారు. హైదరాబాద్ లో హోటల్ మేనేజ్మెంట్ స్కూల్ లో లెక్చరర్ గా పని చేస్తున్నాడు సుప్రియే. అదే విధంగా అభయ్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తెలంగాణలో ఇద్దరు స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవడం ఇదే మొదటిసారి. ఈ వివాహ వేడుక సంప్రదాయ బద్ధంగా మంగళ వాయిద్యాల మధ్య జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో సుప్రియో, అభయ్ లు ఒక్కటయ్యారు. ఇక ఈ సంఘటనను చూసిన ప్రతి ఒక్కరూ షాక్ కు గురవుతున్నారు.