హిందూ దేవుళ్లను విమర్శించిన వారిని పక్కన పెట్టుకుని కేసీఆర్ బీజేపీని విమర్శిస్తున్నారు- కిషన్ రెడ్డి.

-

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి ఫైరయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మీడియా సమావేశం వినాలంటే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు కిషన్ రెడ్డి. ఓవైపు అసదుద్దీన్, మరో వైపు అక్బరుద్దీన్ ను కూర్చోపెట్టుకుని నీతులు చెప్పొద్దని.. హిందు దేవుళ్లను విమర్శించిన వారిని పక్కనపెట్టుకుని బీజేపీని కేసీఆర్ వివర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హింసను, ఘర్షణను ప్రేరేపించేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని, బాధ్యత కలిగిన సీఎం అలా మాట్లాడకూడదని హితవు పలికారు. కుటుంబ పాలనపై తెలంగాణ బిడ్డలు పౌరుషాన్ని చూపించాల్సిన అవసముందని అన్నారు. బీజేపీని విమర్శించే హక్కు టీఆర్ఎస్ లేదని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంపై పియూష్ గోయల్ స్పష్టత నిచ్చారని వెల్లడించారు కిషన్ రెడ్డి. 20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా కొనుగోలు చేసేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు.

టీఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో వెళ్లేందుకు పెట్టిన శ్రద్ధ రైతుల సమస్యల పరిష్కారానికి పెట్టాలని సూచించారు.  ముఖ్యమంత్రి సాధారణ రైతు దగ్గర నుంచి ప్రధాన మంత్రి, అమెరికా ప్రెసిడెంట్ జోబిడెన్ ను కూడా భయపెడతాడని ఎద్దేవా చేశారు  కిషన్ రెడ్డి. హైదరాబాద్ నగరంలో ఎలాంటి డెవలప్మెంట్ కనిపించడం లేదని.. సాధారణ కాంట్రాక్టర్లకు కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని, కాంట్రాక్టర్లకు రూ. 800 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలిపారు. తెలంగాణ వచ్చిన మొదట్లో హైదరాబాద్ నగరానికి మిగులు బడ్జెట్ ఉండేదని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news