సీఎంకు నీతి అయోగ్ ప్రాధాన్యత తెలియదనుకుంటా – ఎన్విఎస్ఎస్ ప్రభాకర్

-

సీఎం కేసీఆర్ కు నీతి అయోగ్ ప్రాధాన్యత తెలియదనుకుంటా అంటూ ఎద్దేవా చేశారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్. సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ మీటింగ్ లో పాల్గొనను అని అనేక మాటలు మాట్లాడారని.. మమత బెనర్జీ, అరవింద్ క్రేజీవాల్ రాజకీయంగా వ్యతిరేకిస్తారు కానీ నీతి ఆయోగ్ సమావేశం లో పాల్గొంటున్నారని అన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం ప్రకారం ఆయన పాల్గొనవద్దు అనుకుంటున్నారు కావచ్చని అన్నారు.తెలంగాణ కేబినెట్ సమావేశలో మంత్రులు పాలసీ నిర్ణయాలలొ మాట్లాడినరా..? అని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ అన్ని మాట్లాడుతారు.. సీఎస్ ఎజెండా చదువుతారు.. మంత్రులు ఎప్పుడైన మాట్లాడినరా..? అన్నారు. కలెక్టర్ సమావేశలలో ఎప్పుడైన వారి అభిప్రాయాలు తీసుకున్నారా…? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన నిధులు వాడుకోలేదని నిన్న నీతి ఆయోగ్ విడుదల చేసిన ప్రెస్ నోట్ ద్వారా తెలుస్తోందన్నారు. స్టేట్ ప్లానింగ్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ ఏనాడైన  సమావేశలు నిర్వహించిన సందర్భలు ఉన్నాయా..? అంటూ ప్రశ్నించారు.

రాజకీయాలు, రాజకీయ నియామకాల కొరకు కార్పోరేషన్ ఏర్పాటు చేసింది.. కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుక వచ్చి కమిషన్ లు పంచుకున్నారని ఆరోపించారు ప్రభాకర్. నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలను ఒకే దృష్టి తో చూస్తుందని..రాష్ట్రలు, కేంద్రము కూర్చొని మాట్లాడుకోవడానికే  నీతి ఆయోగ్ మీటింగ్ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news