రేవంత్‌ బీజేపీలోకి వస్తే ఓ స్నేహితుడిలా స్వాగతిస్తాను : ధర్మపురి అరవింద్

-

కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ మేనిఫెస్టో మైనార్టీ ప్రాపర్టీలా ఉందని విమర్శించారు. హిందువుల దగ్గర దోచుకుంటూ ముస్లింలకు పంచి పెట్టేలా మేనిఫెస్టో రూపొందించారని అన్నారు . దేశం బలమైన శక్తిగా ఎదగటం చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు . అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

మామూలుగా అయితే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమర్థుడు అన్నారు. అదే కాంగ్రెస్‌లో ఉంటే ఆయన అసమర్థుడిగా మారిపోతారని, రేవంత్‌ రెడ్డికి చాలా రాజకీయ జీవితం ఉందని.. మరో 15 సంవత్సరాల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారని పేర్కొన్నారు. కానీ ఆయన ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం భవిష్యత్తు లేదని ,అందుకే భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలని అరవింద్ హితవుపలికారు. బీజేపీలో చేరాలని ఆహ్వానించారు. రేవంత్‌ బీజేపీలోకి వస్తే ఓ స్నేహితుడిలా స్వాగతిస్తానని ధర్మపురి అరవింద్ అన్నారు. అయితే, అర్వింద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించిన పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version