ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన కోహ్లీ

-

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ దుమ్మురేపాడు. ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో నాలుగో నెంబర్‌ దక్కించుకున్నాడు. ఇక వన్డేల్లో నెంబర్‌ స్పాట్‌లో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన పొట్టి క్రికెట్‌ సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేసిన కేఎల్‌ రాహుల్‌ నెంబర్‌ దిగజారింది. వన్డేల్లో రోహిత్‌ శర్మ ఓ స్థానం కోల్పోయాడు. ఈ ఇద్దరు మినహా భారత్ నుంచి ఎవరూ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు.

ఐసీసీ ట్వంటీ ట్వంటీ.. వన్డే ర్యాంకింగ్‌లను ప్రకటించింది. టీ ట్వంటీ.. బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ మలాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. భారత్‌తో జరిగిన సిరీస్‌లోనూ మలాన్‌ మెరుగైన ప్రదర్శన చేశాడు. దీంతో ఫస్ట్‌ ప్లేస్‌లోనే కొనసాగుతోంది. ఇక ఆస్ట్రేలియా టీ ట్వంటీ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఐదు మ్యాచ్‌లో పొట్టి క్రికెట్‌ సిరీస్‌లో అరదగొట్టాడు. ఓ స్థానం మెరుగుపరుచుకున్నాడు. నాలుగో స్థానానికి ఎగబాకాడు.

అయితే టీ-20లో ఘోరంగా విఫలమైన కేఎల్‌ రాహుల్‌కి ఓ స్థానం దిగజారిపోయాడు. ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు. పాకిస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌ బాబర్‌ ఆజామ్‌ మూడో స్థానంలో నిలిచాడు. ఇక బౌలర్ల కేటగిరిలో ఏ ఒక్క భారతీయుడికి అవకాశం దక్కలేదు. తొలి స్థానంలో సౌతాఫ్రికా బౌలర్‌ తబ్రయిజ్‌ శంషి ఉండగా.. రెండో స్థానంలో రషీద్‌ ఖాన్‌ ఉన్నాడు.

వన్డే ఫార్మాట్‌లోనూ ర్యాంకింగ్స్‌ను ఐసీసీ ప్రకటించింది. బ్యాట్స్‌మెన్‌లలో విరాట్‌ కోహ్లీ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాడు. ఇక పాకిస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌ బాబర్‌ అజామ్‌ రెండో స్థానంలో ఉండగా.. ఓ స్థానం కోల్పోయి రోహిత్‌ శర్మ మూడో స్థానానికి పరిమితం అయ్యాడు. ఇక బౌలింగ్‌ కేటగిరిలో ట్రెంట్‌ బౌల్డ్‌ తొలి స్థానంలో ఉండగా.. జస్‌ప్రీత్‌ బూమ్రా మూడో స్థానం దక్కించుకున్నాడు. ఇక వన్డేల్లో నెంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా షకీబుల్‌ హాసన్‌ దక్కించుకోగా..రవీంద్రజడేజాకు 9వ స్థానం దక్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version