వేసవిలో పసిపిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే… ఈ 5 మస్ట్..!

-

వేసవి ఎంతో చిరాకుగా ఉంటుంది. వేడి గాలులు చెమట ఉక్కపోత.. దీంతో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కంఫర్ట్ గా ఉండదు. చల్లగా ఉండకపోవడంతో మనకి చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. మనకే ఇలా ఉంటే పసిపిల్లలకి ఎలా ఉంటుంది..? పసిపిల్లలకు ఆరోగ్యం ఎంతో ముఖ్యం. పైగా వాళ్ళు కంఫర్ట్ గా ఉండాలి లేకపోతే సమస్యలు కలుగుతాయి. పైగా వాళ్ళు ఆ సమస్యలని చెప్పలేరు కూడా.

అందుకనే తల్లులే జాగ్రత్త వహించాలి పిల్లలు ఆరోగ్య పై కాస్త శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా వేసవిలో ఎండగాలులు, తీవ్ర ఉష్ణోగ్రతల వలన పిల్లలుకి ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్లకి కంఫర్ట్ ని ఇవ్వడం చాలా అవసరం వీటిని మీరు కచ్చితంగా అనుసరిస్తే ఏ బాధ లేకుండా పిల్లలు నవ్వుతూ ఉంటారు. లేకపోతే రోజంతా ఏడుస్తారు.

డిహైడ్రేషన్ లేకుండా చూసుకోండి:

పిల్లలు హైడ్రాయిడ్ గా ఉండడం చాలా ముఖ్యం. ఆరు నెలల దాటిన పిల్లలకి నీళ్ళని అందించండి. ఆరు నెలలకి ముందు అవసరం లేదు ఎందుకంటే తల్లిపాలలో సరిపడా నీళ్లు ఉంటాయి. తల్లిపాలు ఇస్తే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది డిహైడ్రేషన్ సమస్య ఉండదు. ఫార్ములా పాలని ఇచ్చినా కూడా డిహైడ్రేషన్ సమస్య ఉండదు.

తేలిక బట్టలు వేయండి:

ఫోటోలు కోసం అని లేకపోతే అందమైన బట్టలు వేయాలని ఆలోచించి తల్లిదండ్రులు కంఫర్ట్ గా లేని బట్టల్ని వేస్తూ ఉంటారు దీని వలన వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వీలైనంతవరకు తేలికపాటి కాటన్ దుస్తులు వేయండి ఇవి పిల్లలకి కంఫర్ట్ ని ఇస్తాయి. అలానే ముదురు రంగులు కాకుండా లైట్ గా ఉండే దుస్తుల్ని వేయండి.

స్కిన్ ఎలర్జీలు ఉన్నాయేమో చూడండి:

చర్మంపై ర్యాషెస్ ఇన్ఫెక్షన్స్ వంటివి వాళ్ళకి ఇబ్బందిని కలిగిస్తాయి. సమ్మర్లో ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. డైపర్ ర్యాష్ వంటివి కూడా కలుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు డైపర్ క్రీమ్ వంటివి రాయండి.

స్నానం తక్కువ సేపు చేయించండి:

చాలామంది పసిపిల్లలకి వేడి వేడి నీళ్లు పోస్తూ ఉంటారు కానీ వేసవిలో గోరువెచ్చని నీళ్లు పోయడం మంచిది. స్నానం తక్కువ సేపు చేయిస్తే చర్మం పొడిబారి పోకుండా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా తప్పక పాటించండి.

డైపర్ వేయకండి:

చాలామంది తల్లులు రోజంతా డైపర్ వేసేస్తూ ఉంటారు పిల్లలకి కంఫర్ట్ ని ఇవ్వదు. సమ్మర్ లో డైపర్ వేయకుండా ఫ్రీగా వదిలేయండి చర్మంపై ఇన్ఫెక్షన్స్ వంటివి కలగవు. ఇలా వేసవిలో పాటిస్తే ఖచ్చితంగా ఏ సమస్య లేకుండా పిల్లలు హ్యాపీగా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news