రాహుల్ గాంధీకి అన్యాయం జరిగితే ఏపీ నుంచి స్పందన లేదు – కేవీపీ

-

రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయంపై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతా స్పందించారని.. కానీ ఒక్క ఆంధ్ర ప్రదేశ్ మినహా అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. ఏపీ నుంచి 25 మంది లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు, 175 మంది శాసనసభ్యులు ఉన్నారని.. కానీ ఒక్కరు కూడా అన్యాయం అని కనీసం స్పందించలేదని విమర్శించారు.

భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రమాదకర పద్ధతులను కేంద్రంలోని బిజెపి అనుసరిస్తోందని విమర్శించారు. జాతీయ నాయకుడి స్థాయిలో ఉన్న చంద్రబాబు స్థాయి తగ్గించుకుంటే ఎలా అని నిలదీశారు. బిజెపిని వైసీపీ ఎందుకు ప్రశ్నించలేకపోతుందో తనకు కారణం తెలియదని అన్నారు. 2018లో టిడిపితో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడానికి తాను వ్యతిరేకించానని.. కానీ ఈ విషయం బహిరంగంగా ఎప్పుడు చెప్పలేదని అన్నారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నోరు విప్పలేదని అన్నారు కేవీపీ.

Read more RELATED
Recommended to you

Latest news