తారకరత్న అలా చేసి ఉండి ఉంటే.. నేడు ఆయన కెరియర్ ఇంకోలా ఉండేదా..?

-

తారకరత్న గుండెపోటుకు గురై గత 23 రోజులుగా బెంగళూరులో చికిత్స పొంది మృత్యుతో పోరాడి.. చివరికి ఫిబ్రవరి 18వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ నేపథ్యంలోనే తారకరత్న ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా తారకరత్న తండ్రి మోహన్ కృష్ణ తారకరత్నను ఎందుకు దూరం పెట్టారు అనే విషయం కూడా బాగా వైరల్ గా మారింది.. ఇలా దాదాపు పది సంవత్సరాల పాటు తారకరత్నను తన తండ్రి దూరం పెట్టడానికి కారణం ఇష్టం లేని పెళ్లి తారకరత్న చేసుకోవడమే.. తారకరత్న పెళ్లి చేసుకున్న అమ్మాయి అలేఖ్య రెడ్డికి అప్పటికే పెళ్లై విడాకులు తీసుకుంది.. పైగా వేరే కులం కావడంతో మోహన్ కృష్ణ వీరి పెళ్లికి ఇష్టపడలేదు.. దాంతోనే వీరిద్దరిని ఇంటికి ఆహ్వానించడానికి ఆయన సముఖం చూపించలేదు.

ఒక్క పెళ్లి విషయంలో తారకరత్న అలా చేసి ఉండి ఉంటే.. కచ్చితంగా ఈ రోజు ఆయన మరో స్టేజ్ లో ఉండేవారు అంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. అసలు విషయంలోకి వెళితే మోహనకృష్ణ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన ఒక ప్రొడ్యూసర్ చిన్న కూతురుని తారకరత్నకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. అంతేకాదు పెద్దల సమక్షంలో తారకరత్న తో ఆ అమ్మాయి పెళ్లి విషయం కూడా చర్చించుకున్నారు . కానీ ఈ విషయం తెలిసి తారకరత్న ఇంట్లో నుండి వెళ్లిపోయి తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత మోహనకృష్ణ వీరి పెళ్లికి అంగీకరించకపోవడంతో ఇంట్లో నుండి వారిని వెళ్ళగొట్టారు.

ఇలా తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్న తారకరత్న.. తండ్రికి దూరమయ్యానన్న బాధ.. మరొకవైపు సినిమాలలో కూడా సక్సెస్ కాలేక పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఒకవేళ తండ్రి మెచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉండి ఉంటే ఆయన జీవితం కచ్చితంగా ఇప్పుడు మరోలా ఉండేదని చెప్పడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news