ఈగలకు ఉన్న ఈ ఫీచర్‌ను మనుషులకు కూడా అప్లై చేస్తే వివాహేతర బంధాలే ఉండవేమో.!

-

కొన్ని తీపి వస్తువులు కిందపడినా, లేక వాటి వాసన బాగా వస్తున్న ఈగలు వచ్చేస్తాయి.. ఇక సమ్మర్‌లో అయితే ఈగలుఇంట్లో  తెగ ఇబ్బందిపెడతాయి. ఇంట్లో ఈగలు ఉండటం ఎవరికి నచ్చదు.. వాటిని వదిలించుకోడానికి ఏదో ఒకటి చేస్తాం.. మీకు ఎప్పుడైనా అనిపించిందా.. అసలు ఈ భూమ్మీద ఉన్న కొన్నివాటివల్ల ఏంటి ఉపయోగం.. ఇవి ఎందుకు పుట్టాయి అని.. ఇప్పుడు ఈగలు, దోమలు, చీమలు ఇలాంటివి ఉంటాయి కదా.. వీటివల్ల ఎవరికి ఉపయోగం..పైగా హాని చేయడంలో ముందుంటాయి..? ప్రకృతిలో ఈగలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మొక్కలకు పువ్వులు, కాయలూ వచ్చేలా చేస్తున్నాయి. ఈగల గురించి కొన్ని ఇంట్రస్టింగ్‌ పాయింట్స్..
ఈగలు చెత్త, వ్యర్థాలు, కుళ్లిన ప్రాణులు వంటి వాటిపై వాలతాయి. అందుకే అవంటే మనకు నచ్చదు.. అలా వాలడం వల్ల వాటికి వ్యాధులను తెచ్చే సూక్ష్మక్రిములు అంటుకుంటాయి. ఆ ఈగలు మనపై వాలినప్పుడు మనకు కూడా ఆ వ్యాధులు సోకగలవు. ఇలా ఈగలు 65 రకాల వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయట…డయేరియా, కలరా, టైపాయిడ్, కుష్టు, ఆంత్రాక్స్, క్షయ ఇలా ఎన్నో ఉన్నాయి లిస్ట్‌లో..
ఈగలు ఆహారాన్ని నమలలేవు. అవి ఎంజైములను పదార్థాలపై ఉమ్ముతాయి. దాంతో ఆ పదార్థాలు ద్రవంగా మారతాయి. ఆ ద్రవాన్ని ఈగలు పీల్చుతాయి.
సేంద్రియ పదార్థాలు మొక్కలకు అందేలా చేస్తాయి. ఇతర పురుగులు, జంతువులకు ఈగలు ఆహారం అవుతున్నాయి. ఈగలు త్వరగా వృద్ధి చెందుతాయి. ఒక్కో ఈగ 4 రోజుల్లో 500 గుడ్లు పెడుతుంది. వారంలో అవి ఈగలు అవుతాయి. ఒక్కో ఈగా 25 రోజులు బతకగలదట. అందుకే వాటి సంఖ్య విపరీతంగా ఉంటుంది.
ఈగల కాళ్లకు సెన్సార్లు ఉంటాయి. మనకు నాలికపై రుచి నాళికల లాంటివి అవి…అందువల్ల ఈగలు దేనిపై వాలినా కాళ్లతో రుచి తెలుసుకుంటాయి..నచ్చితే జుర్రేస్తాయి…
సంభోగం సమయంలో మగ ఈగ.. ఆడ ఈగ శరీరంలోకి స్పెర్మ్‌తో పాటు పెప్టైడ్‌ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. తద్వారా ఆ ఆడ ఈగ ఆకర్షణను కోల్పోతుంది. దాంతో ఇతర మగ ఈగలు దాని జోలికి రావు. ఓరిని..ఇది భలే ఉంది కదా..!
హత్య ఎప్పుడు జరిగిందో తెలుసుకునేందుకు 13వ శతాబ్దంలో ఈగల సంఖ్య, లార్వాను పరిశీలించేవారట.. తద్వారా మరణ రహస్యం వీడేది.
కొన్ని రకాల ఈగలు.. మొక్కల పుప్పొడిని ఇతర మొక్కలకు చేరవేస్తాయి..తద్వారా పువ్వులు, కాయలు వచ్చేలా చేస్తున్నాయని పరిశోధనల్లో తేలింది.
ఈగలు కుళ్లిన జీవులపై గుడ్లు పెడతాయి. అలా పుట్టే పిల్లలు.. జీవుల మాంసాన్ని నీరులా మార్చుతాయి. ఆ నీరు క్రమంగా భూమిలో కలుస్తుంది. అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇలా ఈగలు పర్యావరణానికి మేలు చేస్తున్నాయి.
సో.. ఇలా మనకు తెలియకుండా ఈగలు కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నాయి.. ప్రాణం ఉన్న ప్రతి జీవి వల్ల ఈ ప్రకృతికి ఏదో ఒక లాభం ఉంటుంది. !

Read more RELATED
Recommended to you

Latest news