మేము అధికారంలోకి వస్తే పార్థసారథి సంగతి తేలుస్తాం: జగ్గారెడ్డి

-

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు. కరోనా సమయంలో రెమిడీసివర్ ఇంజక్షన్ ని ప్రభుత్వాలు ఎందుకు ఉచితంగా ఇవ్వలేదని ప్రశ్నించారు. హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెమిడీసివర్ ఇంజక్షన్ లక్ష వరకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఐటీ రైడ్స్ జరిగినప్పుడు 500 కోట్ల పై ఏం జరిగింది..? అనే విషయం ఇప్పటివరకు బయటకు రాలేదు అన్నారు. 500 కోట్లు కాదు పది వేల కోట్ల వరకు ఐటీ రైడ్స్ లో బయటపడి ఉంటాయని అన్నారు.

jaggareddy | జగ్గారెడ్డి
jaggareddy | జగ్గారెడ్డి

 

ఆ సమయం లో సామాన్య ప్రజలకు రెమీడీసివర్ ఎట్లా కొనాలో అర్థం కాలేదని అన్నారు.పార్థసారథి రాజ్యసభ నామినేషన్ వేసే లోపు చేసిన స్కామ్ కి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెమిడీసివర్ కి అనుమతి ఇచ్చింది ఎవరు..? మూడు నెలల తరువాత దాన్ని తీసుకోవద్దు అని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. దీని వెనకాల ఫార్మా మాఫియా ఉందని ఆరోపించారు జగ్గారెడ్డి. మనుషుల ప్రాణాలతో సొమ్ము చేసుకున్న వ్యక్తికి రాజ్యసభ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

కరోనా టైంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇలాంటి స్కాంలు జరిగేవి కావు అన్నారు. ఫార్మా స్కామ్ డబ్బులు వాడుకోవడం కోసమే కెసిఆర్ పార్థసారధికి రాజ్యసభ సీటు ఇచ్చారు అని అన్నారు. మేము అధికారంలోకి వస్తే పార్థసారధి సంగతి తేలుస్తామన్నారు. ఎన్నికల కమిషన్ కి కూడా ఫిర్యాదు చేస్తామని, ఇలాంటి నేరాలు చేసే వ్యక్తికి రాజ్యసభ ఎలా ఇస్తారు అనేది అడుగుతాను అన్నారు. ఈ విషయంపై సీబీఐకి కూడా లేఖ రాసి విచారణ చేయాలని కోరుతానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news