మీరు స్మార్ట్ కాకపోయినా విజయం మీ దరికి చేరాలంటే ఈ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు..

-

తెలివైన వాళ్లే విజయం సాధిస్తారనుకుంటే పొరపాటే. చాలామంది తెలివైన వాళ్ళు సరైన విజయం అందుకోలేకపోతున్నారు. అంతగా స్మార్ట్ కాకపోయినా విజయం మీ దరికి చేరుకోవడానికి ఒకే ఒక్క క్వాలిటీ ఉంటే చాలు. సాధారణంగా తెలివైన వారు అన్ని విషయాలని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఏది చేయాలన్నా దాని చుట్టూ ఉండే పరిస్థితులని అంచనా వేస్తారు. ఏం చేసినా దానివల్ల వచ్చే పాజిటివ్, నెగెటివ్ అంశాలని బేరీజు వేసుకుంటారు. అలా బేరీజు వేసుకునే నెగెటివ్ అంశాలు ఎక్కువగా కనిపిస్తే దాని జోలికి వెళ్ళకుండా ఉంటారు.

ఐతే ఆ క్వాలిటీయే తెలివైన వారికి విజయం దక్కకుండా చేస్తుందని చాలా మంది అభిప్రాయం. అందుకే నెగెటివ్ గా కనిపించినప్పటికీ ధైర్యం చేసి అడుగేస్తే విజయాలు చేకూరుతాయని చెబుతున్నారు. ధైర్యం మీ విజయాన్ని దగ్గరకి చేరుస్తుందని, ధైర్యంగా అడుగు ముందుకు వేసేవారికే విజయం సిద్ధిస్తుందని అంటున్నారు. స్మార్ట్ జనాలందరూ విజయం సాధించకపోవడానికి ముఖ్య కారణం ధైర్యం చేయకపోవడమే అని చాలా మంది నిపుణుల అభిప్రాయం.

అందుకే నీకెంత తెలివి ఉన్నదాని కంటే నువ్వెంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నావన్నదే ముఖ్యం అని చెబుతున్నారు. మీరు అంతగా స్మార్ట్ కాకపోతే పెద్దగా బాధపడాల్సిన పనిలేదు. ధైర్యం పెంపొందించుకుని సమస్యలని సాల్వ్ చేసుకోగలనని నమ్మకం పెంచుకుంటే చాలు. ఎప్పటికైనా విజయం మీ దరికి చేరుతుంది. అందుకే మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఎవరిలోన ఏముందో ఎవరికీ తెలియదు. మీ గురించి ఇతరులకు తెలియదు. కొన్ని సార్లు మీకే తెలియకపోవచ్చు. కాబట్టి ధైర్యం చేయండి. విజయం అదే వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news