ఇప్పటికే చాలా మంది రైతులు పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారు. ఆర్ధిక ఇబ్బందులు తగ్గుతాయి. అయితే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన(PMKSNY) పథకం యొక్క తొమ్మిదవ విడత డబ్బులను కేంద్రం సోమవారం దేశ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది.
కొందరి రైతులకి మాత్రం వివిధ కారణాల వలన ఈ డబ్బులు అందడం లేదు. ఒక్క వాయిదా కూడా పొందలేని రైతులు చాల మందే వున్నారు. అయితే డబ్బులు రాలేదు అంటే ఏమాత్రం బాధ పడద్దు. ఇలా ఫిర్యాదు చేస్తే డబ్బులని పొందొచ్చు. మరి దాని కోసం పూర్తి వివరాలలోకి వెళ్తే.. కొన్ని సార్లు ప్రభుత్వం నుంచి మీ బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ చేయబడుతుంది. కానీ రైతుల ఖాతాకు చేరదు.
దీనికి కారణం మీ ఆధార్, అకౌంట్ నంబర్ మరియు బ్యాంక్ అకౌంట్ నంబర్‌లోని తప్పు కావచ్చు. అందుకని మీరు మొదట మీ ప్రాంతంలోని వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. మీ సమస్యని చెప్పండి. స్పందించకపోతే హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేయవచ్చు.
డబ్బు అందని వారు హెల్ప్‌లైన్ నంబర్ 011 24300606 /011 23381092 కు నేరుగా డయల్ చెయ్యచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు, PM కిసాన్ హెల్ప్ డెస్క్ (PM KISAN హెల్ప్ డెస్క్) pmkisan [email protected] మెయిల్ ద్వారా సంప్రదించ వచ్చు. ఇలా సమస్య చెప్పి డబ్బులు పొందే అవకాశం వుంది.