నవరాత్రి అనేది దుర్గాదేవికి అంకితం చేయబడిన పవిత్రమైన హిందూ పండుగ. ఇది తొమ్మిది రాత్రుల ప్రతీకాత్మక వేడుక మరియు ఉత్తర మరియు తూర్పు భారతదేశం అంతటా గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. దుర్గా మాత శరన్నవ రాత్రి ఉత్సవాలు అత్యంత సమీపించాయి. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు 9 రోజులు 9 రూపాల్లో 9 వాహనాల పై అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రతి ఏడాది నవరాత్రులు మొదలయ్యే రోజును బట్టి ఒక్కో వాహనం పై అమ్మవారు భూమిపైకి వస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
అమ్మవారికి ఇష్టమైన దేవి భాగవత, సౌందర్యలహరి పారాయణలను చేసుకోవాలి. కొన్ని అర్చనలతో నిత్యం అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి ఇష్టమైన భజన గీతాలను వినిపించాలి. సహస్ర నామాలను స్మరించాలి. నిత్యం అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించాలి. హోమాలు చేయడంవల్ల అమ్మవారికి సంతృప్తి కలుగుతుంది. ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది. ఇకపోతే ఈ నవరాత్రుల సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు ఒకసారి చుద్దాము..
*.నవరాత్రుల సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తిక్ గుర్తు పెట్టాలంట. దాని వలన ఇంట్లో మంచి జరుగుతుంది. అంతే కాకుండా అమ్మవారు అడ్డంకులన్ని తొలిగించి, సంతోషాన్ని తీసుకొస్తుందంట.
*.నవరాత్రుల సమయంలో ఇంటి ప్రధానా ద్వారానికి మామిడి ఆకు తోరణాలు కట్టాలంట. ఇది ఇంట్లో నెగిటీవ్ ఎనర్జీని తొలిగిస్తుంది.
*. నవరాత్రుల సమయంలో నల్లని బట్టలు అస్సలు ధరించకూడదు. కేవలం తెల్లని బట్టలను వేసుకోవాలి..