జగన్ రెడ్డి పాలనలో జర్నలిజానికి సంకెళ్లు వేస్తున్నారు – నారా లోకేష్

-

సీనియర్ జర్నలిస్టు అంకబాబును సిఐడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విజయవాడలోని ఆయన నివాసంలోనే సిఐడి అధికారులు అరెస్టు చేశారు. వాట్సాప్ లో ఓ మెసేజ్ ఫార్వార్డ్ చేసినందుకు అంకబాబును అధికారులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆయనని అరెస్టు చేసిన సిఐడి అధికారులు గుంటూరులోని కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు.

ys jagan on nara lokesh

అంకబాబును అరెస్టు చేసిన సిఐడి అధికారులు ఆయన భార్యకు నోటీసులు జారీ చేశారు. ఆయన అరెస్టుకు ఆందోళనకు దిగిన జర్నలిస్టులను అరెస్టు చేసిన తీరుపై టిడిపి అగ్ర నేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ” జగన్ రెడ్డి పాలనలో జర్నలిజానికి సంకెళ్లు వేస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా చీకటి జీవో తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా రాజద్రోహం కేసులు పెట్టి పాత్రికేయులను అరెస్టు చేస్తున్నారు. ఇంకెంతకాలం ఈ నిరంకుశత్వం.

వాట్సాప్ లో వార్త పోస్ట్ చేశారని సీనియర్ పాత్రికేయులు అంకబాబు గారిని అరెస్టు చేయడమే అన్యాయం అనుకుంటే ఇప్పుడు ఆయనకు మద్దతుగా గళం విప్పిన సాటి జర్నలిస్టులను వేధించడం ఇంకా దారుణం. అంకబాబు అరెస్టుని, పత్రికా స్వేచ్ఛని హరిస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహా టీవీ ఎండి వంశీ తో పాటు పలువురు జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తక్షణమే అరెస్టు చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలి”. అని ట్వీట్ చేశారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news