కేవలం రూ.1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే రూ.15 లక్షలు పొందోచ్చు..

-

డబ్బులను పొదుపు చెయ్యాలని అనుకుంటారు.. అది చాలా మంచి ఆలోచన..అయితే చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వచ్చే దిశగా డబ్బులను పెడితే మంచి లాభాలను అందుకోవచ్చు.. చిన్న మొత్తంతో కూడా దీర్ఘకాలంలో భారీ మొత్తాన్ని సొంతం చేసుకోవచ్చు. రూ. 1000 పొదుపుతో కూడా మీరు రూ. 15 లక్షలు వెనకేయొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే..

ఇక విషయానికొస్తే..మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు దీర్ఘకాలంలో ఆకర్షణీయ రాబడి పొందొచ్చని మార్కెట్ నిపుణులు పేర్కొంటుంటారు. సగటును చూస్తే 12 శాత రాబడి పొందొచ్చని సూచిస్తుంటారు. అందువల్ల మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. మంచి రాబడి సొంతం చేసుకోవచ్చు. మీరు నెలకు రూ. 500 నుంచి కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. 15 నుంచి 20 ఏళ్ల టెన్యూర్‌తో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి పొందడానికి అవకాశం ఉంటుంది..

ప్రతి నెల మీరు రూ. 1000 రూపాయలు పొదుపు చేస్తే పొదుపు చేస్తే.. ఏడాదికి రూ. 12 వేలు ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది. ఇలా మీరు 20 ఏళ్ల వరకు డబ్బులు పెడుతూ వెళ్లాలి. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ. 2.4 లక్షలు అవుతుంది. అయితే 12 శాతం రాబడి ప్రకారం చూస్తే.. మీరు టెన్యూర్ అయిపోయిన తర్వాత చేతికి దాదాపు రూ. 10 లక్షలు వస్తాయి. ఇందులో రాబడి రూపంలో మీకు 7.6 లక్షల మీకు లాభం వస్తుంది..మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల ఫండ్ 14 శాతం రాబడిని అందిస్తే.. అప్పుడు మీకు ఏకంగా రూ. 13 లక్షలకు పైగా వస్తాయని చెప్పుకోవచ్చు. అదే 15 శాతం రాబడి వస్తే మాత్రం.. మీ చేతికి ఏకంగా రూ. 15 లక్షలకు పైగా వస్తాయి. అంటే నెలకు రూ. 1000 పొదుపుతో ఏకంగా రూ. 15 లక్షలకు పైగా పొందొచ్చని చెప్పుకోవచ్చు అయితే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి.రిస్క్ ఉంటేనే మని ఇన్వెస్ట్ చెయ్యాలి.. లేకుంటే సేవింగ్ స్కిమ్స్ బెస్ట్.. మీ చాయిస్ అది..

Read more RELATED
Recommended to you

Latest news