ఈ నెల 31లోపు ఈ స్కీమ్‌లో చేరితే..రూ.18,500 పొందోచ్చు.. పూర్తి వివరాలు..

-

60 ఏళ్లు పైబడిన వాళ్ళు పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యం.. ప్రభుత్వం కూడా వారి కోసం ప్రత్యేకమైన స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.. 2017లో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి వయ వందన యోజనను ప్రవేశపెట్టింది..ఈ పథకం కింద పెట్టుబడిదారులకు ప్రయోజనాలను అందించే అనేక పథకాలు ఉన్నాయి. ఈ పథకాలు సీనియర్ సిటిజన్లకు ఆర్థిక భద్రతతో పాటు పదవీ విరమణ అనంతర ఖర్చులను కూడా అందిస్తాయి. పెట్టుబడి పెట్టడానికి, ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు చివరి తేదీ మార్చి 31, 2023. ఈ నేపథ్యంలో సరైన సమయంలో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని పెట్టుబడి పెట్టవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఈ పథకం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం..

 

ప్రధాన్ మంత్రి వయ వందన యోజన కింద 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ నాయకులు గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పెట్టుబడి మొత్తంపై సంవత్సరానికి 7.4 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ మార్చి 31, 2023. ఒక వ్యక్తి ఈ పాలసీలో 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి.. ఒక వ్యక్తి ప్రతి నెలా ఎంత సంపాదిస్తాడు అనేది పెట్టుబడి ఆధారంగా ఆధారపడి ఉంటుంది. పెట్టుబడిని బట్టి నెలకు రూ.1000 నుంచి రూ.9,250 వరకు పెన్షన్ లభిస్తుంది..

ఒక వ్యక్తి ఎంతవరకు పెట్టుబడి పెట్టవచ్చు చూస్తే..కనీసం రూ. 1.50 లక్షలు పెట్టుబడి పెడితే.. మీరు నెలకు రూ. 1,000 వరకు పెన్షన్ మొత్తాన్ని పొందవచ్చు. అదేవిధంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడులపై నెలకు రూ.9,250 పెన్షన్ లభిస్తుంది. భార్యాభర్తలిద్దరూ ఈ పథకంలో పెట్టుబడి పెడితే 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టాలి. అప్పుడు వారిద్దరూ నెలకు రూ.18,500 పొందవచ్చు.. ఈ పథకం కాలపరిమితి పదేళ్లు..నెలకు రూ. 1000 త్రైమాసికానికి రూ. 3 వేలు, అర్ధ సంవత్సరానికి రూ. 6 వేలు, పింఛనుగా సంవత్సరానికి రూ. 12 వేలు.. భార్యాభర్తలకు కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి.. మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news