కండోమ్ వాడకం అనేది ఇపుడు విరివిగా మారుతోంది. కుంటుంబ నియంత్రణ కొరకు ప్రవేశపెట్టిన కండోమ్స్ కాస్త కొందరు అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. అయితే ఇది ఇపుడు అప్రస్తుతం అనుకోండి. అయితే వీటి వాడకం అనేది ముఖ్యంగా ఫ్యామిలిలో తగ్గిపోతోంది. తద్వారా జనాభా పెరుగుదల అనేది మితిమీరిపోతోంది. ఇలా ఇంకా అనేక రకాలైన విషయాలను పరిగణనలోకి తీసుకోని తాజాగా ఓ సర్వే చేపట్టారు. ఆ సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అమ్మాయిలు ఈ విషయంలో క్లారిటీగానే వున్నారు. అయితే అబ్బాయిలు మాత్రం కొంచెం భిన్న అభిప్రాయాలు కలిగి వున్నారు.
2019-2021 మధ్య నిర్వహించిన అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి పెళ్లి అయిన 99శాతం మగవారు, ఆడవారికి అవగాహన ఉంది. వాటి వినియోగం 2015-16 నుంచి 2019-2021 మధ్య 47.8% నుంచి 56.5% పెరిగింది. దేశంలో కుటుంబ నియంత్రణ పద్ధతుల వినియోగం పెరిగింది కానీ, వాటిని ఎక్కువగా వాడుతోంది మాత్రం ఆడవారే. 9.5% మగవారు మాత్రమే కండోమ్స్ వాడుతున్నారు.
అంటే ప్రతి పదిమందిలో ఒకరు మాత్రమే వాడుతున్నట్టు భోగట్టా. కానీ గత అయిదేళ్లలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునే ఆడవారి సంఖ్య 36% నుంచి 37.9% పెరిగింది.
అయితే చాలా సులభంగా అయిపోయే వేసక్టమీ ఆపరేషన్ చేయించుకునే మగవారి సంఖ్య మాత్రం 2015 నాటికి నేటికీ 0.3% ఉండటం బాధాకరం. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మగవారు కండోమ్ వాడకపోవడానికి గల కారణం, అది ధరించిన తరువాత చేసిన సెక్స్ వారికి అంతగా రుచించడంలేదని చెప్పుకొచ్చారట.
అంతేకాకుండా ‘కుటుంబ నియంత్రణ అనేది ఆడవాళ్ల బాధ్యతే కానీ మగవాళ్లది కాదు.’ అని అన్నారట. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్‌లో ప్రతి ముగ్గురి మగవారిలో ఒకరు ఇలాగే భావిస్తున్నారు అని కుటుంబ నియంత్రణ మీద పరిశోధనలు చేస్తున్న అభినవ్ పాండే అన్నారు.