ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసినా ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీకిచెందిన రంగును, గుర్తును దాంతో పాటే ఆ పార్టీలో ఉండే అధినేత ముఖాన్ని కచ్చింతగా చెప్పుకోవాల్సిందే చూపించాల్సిందే. కానీ ఇప్పుడు ఓ మాజీ మంత్రి మాత్రం తాను పోటీ చేస్తున్న పార్టీ రంగును వాడేందుకు అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పటికే మీకు దేని గురించి చెప్తున్నామో అర్థం అయిందే అనుకుంటా. అదేనండి హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి. ఇక పంతానికి పోయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేస్తునం్న పనులు ఇప్పుడు బీజేపీకి పెద్ద షాక్ ఇస్తున్నాయి.
ఎందుకంటే ఆయన మొదటి నుంచి తన స్వంత ఇమేజ్ ను నమ్ముకుంటున్నారు తప్ప బీజేపీ కారణంగా ఆయనకు ప్రజల్లో ఎలాంటి ఇమేజ్ పెరగదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన ఉప ఎన్నికల్లో ఎక్కడా కూడా మోడీ బొమ్మకూడా వాడకుంటా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే దానితో కూడా చివరకు ఆయనకు నష్టమే జరుగుతుందని పక్కన పెడుతున్నారంట. ఇందుకోసమే ఎక్కడా కూడా పార్టీని చూసి మోడీ అభివృద్ధిని చూసి ఓటేయాలని అడగకుండా తనను చూసి ఓటేయాలంటూ కోరుతున్నారు.
ఈ పనులే ఇప్పటి దాకా కాషాయ లీడర్లకు ఇబ్బందిగా మారితే ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఇక ఆయన ప్రచారం కోసం నియజకవర్గంలో మరీ ముఖ్యంగా దళిత వాడల్లో ప్రచారం కోసం కాషాయ రంగు వాహనాలకు బదులుగా నీలం రంగును వాడుతున్నారు. ఎందుకంటే దళితులను ఆకట్టుకోవాలంటే కాషాయ రంగు పనిచేయదని, వారిలో బీజేపీ పట్ల వ్యతిరేకత ఉందని గ్రహించి అంబేద్కర్ ఫూలే అలాగే జగ్జీవన్ రామ్ లాంటి వారి రంగులతో ఓన్ చేసుకున్నట్టు చూపించుకోవడానికి ఈటల ఈ ప్లాన్ వేశారని తెలుస్తోంది.