ఈట‌ల ప్ర‌చారానికి ఆ విధంగా చెక్ పెట్టేస్తున్న హ‌రీశ్‌రావు..

-

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు టీఆర్ ఎస్ పార్టీకి అయినా లేదంటే బీజేపీ పార్టీకి అయినా స‌రే ముఖ్య‌మైన ప‌ని ఏదంటే ప్ర‌తి ఒక్క‌రూ చెప్పే మాట హుజూర‌బాద్ ఉప ఎన్నిక మాత్ర‌మే. కాగా ఇప్పుడు ఇక్క‌డ బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్ అనే కంటూ కూడా హ‌రీశ్ రావు వ‌ర్సెస్ ఈట‌ల రాజేంద‌ర్ అన్న మాదిరిగా ప్ర‌చార తూటాలు పేలుతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు కాస్త ఆచితూచి విమ‌ర్శించుకున్న ఈ ఇద్ద‌రు నేత‌లు ఇప్పుడు సై అంటే సై అంటున్నారు. ఒక‌రి మీద మ‌రొక‌రు డైలాగులు పేల్చ‌తున్నారు. ఇన్ని చేస్తున్నా కూడా ఇంకా ఈట‌ల రాజేంద‌ర్ బ‌లంగానే ఉన్నట్టు టీఆర్ ఎస్ భావిస్తోంది.

harishrao
harishrao

దీంతో ఇప్పుడు మాట‌ల‌తో కూడా ఈట‌ల‌కు చెక్ పెట్టాల‌ని భావిస్తోంది టీఆర్ ఎస్‌. ఇక ఇందుకోసం మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగి మ‌రీ మ‌రోసారి హుజూరాబాద్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇక మంత్రిగారు వ‌స్తే ఇత‌ర పార్టీల‌కు చెందిన వారు టీఆర్ ఎస్ కండువాలు క‌ప్పుకోవ‌డం చాలా కామ‌న్‌. ఇక ఈ ప్రోగ్రామ్ త‌ర్వాత వారంతా కూడా జమ్మికుంటకు హ‌రీశ్ రావు వెంట బ‌య‌లు దేరారు. ఇక్క‌డ కూడా చాలా మంది కండువాలు క‌ప్పేసుకున్నారు.

ఇక ఈ సంద‌ర్భంగా హ‌రీశ్ రావు మాట్లాడుతూ ఈట‌ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈట‌ల త‌మ పార్టీలోకి వ‌చ్చిన‌ప్పుడు తామంతా వెంటే ఉన్నామ‌ని, కానీ ఆయ‌న టీఆర్ ఎస్‌ను వీడితే ఆయ‌న వెంట ఒక్క‌రు కూడా వెళ్లలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా మద్యం లేదా పైస‌లు పంచాతే తాను రాజకీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని చెప్పాడ‌ని, కానీ ఇప్పుడు ఎందుకు వ‌స్తువులు పంచుతున్నారని ప్ర‌శ్నించారు. అంతే కాదు ఇప్పుడు ఆయ‌నే ఓటుకు పదివేలు ఇస్తాన‌ని చెప్తున్నార‌ని మ‌రి రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటారా అని స‌వాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news