రోజువారీ జీవితంలో మనం వాడే చాలా వస్తువులు హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీకి చెందినవే. ఇది మనందరికీ ఎంతో పరిచయం ఉన్న ఎఫ్ఎమ్సీజీ బ్రాండ్.డవ్, ట్రెసెమీ వంటి షాంపూలను రోజువారీ జీవితంలో వాడుతుంటాం. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక వార్త నెట్టింట సంచలనంగా మారింది. యూనీలివర్ కంపెనీ తయారు చేస్తున్నా షాంపూ బ్రాండ్లలో ప్రమాదకర క్యాన్సర్ కలిగించే బెంజీన్ అనే రసాయనం ఉన్నట్లు వాలిసూర్ ల్యాబ్, ఫుడ్ అండ్ డగ్ర్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించింది..
Dove, Nexxus, Suave, TIGI, TRESemme Airsol డ్రై షాంపూలను అమెరికా మార్కెట్ నుంచి రీకాల్ చేసింది. అక్టోబర్ 2021కి ముందు తయారు చేయబడిన ఉత్పత్తులను కంపెనీ రీకాల్ చేస్తోంది. స్ప్రై ఆన్ డ్రై షాంపూలలో ఇలాంటి ప్రమాదకరమైన సమస్యను ఎదుర్కొనడం ఇదే మెుదటి సారి కాదు. డిసెంబర్‌లో కంపెనీ ప్యాంటీన్, హెర్బర్ ఎసెన్స్ డ్రై షాంపూలను కూడా రీకాల్ చేసింది. బెంజీన్ శరీంలోకి వెళ్లటం వల్ల లుకేమియా, బ్లడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
ఆయా ఉత్పత్తులను షెల్ఫ్‌ల నుండి తీసివేయమని రిటైలర్లను కోరింది.గత ఏడాదిన్నర కాలంలో జాన్సన్ అండ్ జాన్సన్స్ న్యూట్రోజెనా, ఎడ్జ్‌వెల్ పర్సనల్ కేర్ కంపెనీకి చెందిన బనానా బోట్ లాంటి ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నాయి. అలాగే ప్రోక్టర్ అండ్ గాంబుల్ స్ప్రే-ఆన్ యాంటీ పెర్స్పిరెంట్‌లు సీక్రెట్ అండ్ ఓల్డ్ స్పైస్, యూనిలివర్స్ సువేవ్ లాంటి ఉత్పత్తుల్లో బెంజీన్ కనుగొనడం, రీకాల్ చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు వెనక్కి తీసుకున్న ఉత్పత్తుల్లో ఉండే బెంజిన్ వల్ల లుకేమియా, ఇతర బ్లడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది. గతంలో జాన్సన్ & జాన్సన్స్ న్యూట్రోజెనా, ఎడ్జ్‌వెల్ పర్సనల్ కేర్ కో, కాపర్‌టోన్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. గత ఏడాది P&G కూడా 30 కంటే ఎక్కువ ఏరోసోల్ స్ప్రే హెయిర్‌కేర్ ఉత్పత్తులను రీకాల్ చేసింది. వీటిలో డ్రై షాంపూ, డ్రై కండీషనర్ కూడా ఉన్నాయి.