ఎల్ఐసీ ఎన్నో రకాల స్కీమ్స్ ని ఇస్తోంది. వీటిలో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒకటి. చాలా మంది నచ్చిన పథకాల్లో డబ్బులు పెడుతున్నారు. ఎల్ఐసీ అందిస్తున్న వాటిలో జీవన్ శాంతి ప్లాన్ కూడా ఒకటి. ఇందులో చేరితే మంచిగా రాబడి వస్తుంది. ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి అనేది యాన్యుటీ ప్లాన్. ఒకేసారి డబ్బులు పెట్టి ఈ ప్లాన్ ని కొనవచ్చు. నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ సింగిల్ ప్రీమియం డిపర్డ్ యాన్యుటీ ప్లాన్ ఇది. దీన్ని కొనే సయమం లోనే మీకు గ్యారంటీ యాన్యుటీ రేటు తెలుస్తుంది. దీనికి తగినట్లుగా మీకు పెన్షన్ వస్తుంది. 30 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు దీన్ని తీసుకోవచ్చు. ఈ పాలసీ కొంటే రెండు యాన్యుటీ ఆప్షన్లు మీకు ఉంటాయి.
డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్, డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్. ఏది కావాలంటే దాన్ని మీరు ఎంచుకోవచ్చు. గరిష్టంగా 79 ఏళ్ల వరకు వయసు వారు ఇందులో చేరవచ్చు. దీని కోసం మీరు రూ. 1.5 లక్షల మొత్తానికి పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి ఏమీ ఉండదు. రూ. 5 లక్షలకు పైన కొంటే అప్పుడు మీకు ఎక్కువ యాన్యుటీ పొందొచ్చు. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున మీకు పెన్షన్ ని ఇస్తారు.
ఏడాది నుంచి 12 ఏళ్ల వరకు డిఫర్టెంట్ పెట్టచ్చు. మీరు రెండేళ్ల డిఫర్మెంట్ ఎంచుకుంటే.. పాలసీ కొన్న రెండేళ్ల తర్వాత నుంచి పెన్షన్ మీకు వస్తుంది. ఇమ్మీడియన్ పెన్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. రూ.10 లక్షల మొత్తానికి జీవన్ శాంతి పాలసీ ద్వారా ప్రతి నెలా ఎంత పెన్షన్ పొందొచ్చొ తెలుసుకుందాం. 30 ఏళ్లు వాళ్ళు, ఐదేళ్ల డిఫర్మెంట్ ఆప్షన్ ఎంచుకుంటే ఏటా రూ. 86 వేల పెన్షన్ వస్తుంది. 12 ఏళ్ల డిఫర్మెంట్ ఆప్షన్ కి అయితే రూ. 1.32 లక్షలు వస్తాయి.