Big Boss OTT Telugu: ‘బిగ్ బాస్’ మైండ్‌లో ఏముందో..ఈ వారం ఎలిమినేషన్ స్పెషల్

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఓటీటీలో ఏడో వారం గేమ్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నది. కంటెస్టెంట్స్ కు ‘బిగ్ బాస్’ రకరకాల టాస్కులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు ఇంటి సభ్యులు జాగ్రత్త పడుతున్నారు. ఓటింగ్ పరంగా చూసుకుంటే అందరికంటే తక్కువ ఓటింగ్ తో డేంజర్ జోన్ లో నటరాజ్ మాస్టర్ ఉన్నారు.

ఓటింగ్ పర్సంటేజీలో గత కొద్ది రోజుల నుంచి బిందు మాధవి టాప్ ప్లేస్ లో ఉంది. కాగా, ఆమె తర్వాత ఉన్న కంటెస్టెంట్స్ తమ పర్ఫార్మెన్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ‘బిగ్ బాస్’ ఇంటి సభ్యులలో ఈ ఏడో వారం ఎలిమినేషన్ ఎవరు కాబోతున్నారనే భయం ఉంది. సోషల్ మీడియా వేదికగా ఈ వారం ఎలిమినేషన్ గురించి చర్చ జరుగుతున్నది.

ఆరో వారం డబుల్ ఎలిమినేషన్ జరగగా, ఏడో వారం కూడా అలానే ఉంటుందా? అనే ప్రశ్నలు వస్తు్న్నాయి. అరియానా, తేజు, హమీద వంటి కంటెస్టెంట్స్ మిగతా కంటెస్టెంట్స్ ను వెరీ కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. అలా మిగతా సభ్యులు సైతం టాస్కులు, ఎలిమినేషన్ గురించి చర్చించుకుంటున్నారు.

ఈ వారం ఫేక్ ఎలిమినేషన్ ఉంటుందా? అనే అంశం కూడా తెరమీదకు వస్తున్నది. అరియానా ద గ్లోరీ కూడా డేంజర్ జోన్ లో ఉందనే వార్తలొస్తున్నాయి. చూడాలి మరి.. ఏం జరుగుతుందో.. నామినేషన్స్ ఎలా జరగబోతున్నాయి? కంటెస్టెంట్స్ ఎవరిని నామినేట్ చేస్తారనేది చర్చనీయాంశం.

Read more RELATED
Recommended to you

Latest news