ఏయిర్ ఇండియా సీఈఓగా టాటా ఆహ్వానాన్ని తిరస్కరించించి ఇల్కర్ ఐసీ..!

-

ఏయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండాలనే టాటా గ్రూప్ ఆహ్వానాన్ని ఇల్కర్ ఐసీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇటీవల టాటా గ్రూప్ కొన్న ఏయిర్ ఇండియా సంస్థ సీఈఓగా టర్కీ దేశానికి చెందిన ఇల్కర్ ఐసీని నియమిస్తున్నట్లు ఫిబ్రవరి 14న ప్రకటించింది. అయితే “జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని” ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఇల్కర్ ఐసీ నియామకానికి ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వకూడదని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ స్వదేశీ జాగరణ్ మంచ్ గత శుక్రవారం డిమాండ్ చేసింది. 

ఇల్కర్ గతంలో టర్కిష్ ఎయిర్ లైన్స్ ను విజయాల బాటలో నడిపారు. ఈ అనుభవంతోనే ఏయిర్ ఇండియాను కూడా విజయాల దిశగా తీసుకెళ్తారని గతంలో టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అన్నారు. ఆ సమయంలో ఒక ఐకానిక్ ఎయిర్‌లైన్‌కు నాయకత్వం వహించే అధికారాన్ని అంగీకరించడం మరియు టాటా గ్రూప్‌లో చేరడం పట్ల నేను సంతోషిస్తున్నాను మరియు గౌరవంగా భావిస్తున్నానని ఇల్కర్ అన్నారు.

ఇదిలా ఉంటే టర్కీ దేశానికి చెందిన వ్యక్తి ఏయిర్ ఇండియాకు సీఈఓగా బాధ్యతలు చేపట్టడానికి ఇండియాలో కొన్ని సంస్థలు తప్పుబడుతున్నాయి. దీని ఫలితంగానే ఇల్కర్ .. టాటా ఆహ్వానాన్ని తిరస్కరించారనే వార్తలు వస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version