నేటి నుంచి బీఎస్‌-6.2 నిబంధన అమలు

-

వాహన కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో బీఎస్‌-6.2 ప్రమాణాలతో కూడిన వాహనాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి తయారు చేసే వాహనాలు ఆ ప్రమాణాల మేరకు ఉండాలని రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తయారీదారులకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆ నిబంధనలు ఇవాళ్టి నుంచి అమలు కానున్నాయి.

ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న బీఎస్‌-6 వాహనాలకు యథావిధిగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. 2000 సంవత్సరం నుంచి కాలుష్య నియంత్రణ ప్రమాణాలను కేంద్రం ప్రవేశపెట్టింది. ఆ నిబంధనలను కఠినతరం చేస్తూ 2020 ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-6 ప్రమాణాలను అమల్లోకి తీసుకువచ్చారు. తాజాగా బీఎస్‌-6.2 ప్రమాణాలు ఈరోజు నుంచి అమలులోకి రానున్నాయి.

గతంలో బీఎస్‌ ప్రమాణాలను తొలుత గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అమలు చేసేవారు. ఆ తరవాత రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించేవారు. ఈసారి మాత్రం రాష్ట్రమంతా ఒకే విధంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news