ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి

-

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై ఫోకస్ పెట్టింది ఈడీ. 2014- 19 మధ్య కాలంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో భారీ అక్రమాలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. ఈ స్కాంలో నిందితులుగా ఉన్న 26 మందికి ఈడీ నోటీసులు జారీ చేపట్టింది. రూ.234 కోట్ల నిధులు దారి మళ్లించినట్లు భావిస్తుంది ఈడీ. స్కిల్ డెవలప్మెంట్ మాజీ ఛైర్మన్ గంటా సుబ్బారావు, డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, ఓఎస్డీ కృష్ణ ప్రసాద్ లకు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణంపై ఈడీ వేగం పెంచింది. ఈ కేసులో నిందితులకు ఉన్న 26 మందికి నోటీసులు జారీ చేపట్టింది. ఇందులో మొత్తం రూ.234 కోట్ల నిధుల మళ్లింపుపై ఈడీ కేసు నమోదు చేసింది. పూణెకి చెందిన పలు కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు ఈడీ భావిస్తుంది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గంటా సుబ్బారావుతో పాటు మాజీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణకు ఈ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరితోపాటు ఓఎస్‌డీ నిమ్మగడ్డ కృష్ణ ప్రసాద్ కు నోటీసులు ఇచ్చింది. హైదరాబాదులోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపింది.

 

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో సీఐడీ కీలక విషయాలు నమోదు చేసింది. 2015 జూన్‌లో స్కిల్ డెవలప్-మెంట్ కార్పొరేషన్ లో ఆర్థికలావాదేవీల్లో అవకతవకలు జరిగాయని గుర్తించింది. జీవో నెంబర్ 4 ప్రకారం సీమెన్స్‌ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్, డిజైన్‌ టెక్‌ ఎండీ వికాస్‌ కన్విల్కర్‌కు గత ప్రభుత్వం రూ.241 కోట్లు కేటాయించిందని తెలిపింది. ఉద్దేశపూర్వకంగా ఈ సొమ్ము అప్పగించిందని వెల్లడించింది. ఈ సొమ్మును 7 షెల్‌ కంపెనీలకు తప్పుడు ఇన్‌వాయిస్‌లు సృష్టించినట్టు తరలించారని తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని టెక్నాలజీ కంపెనీలు, ప్రభుత్వానికి విభజించడంలో అవకతవకలు జరిగాయని సీఐడీ పేర్కొంది. 2017-18లో రూ.371 కోట్లలలో.. రూ.241 కోట్లు గోల్‌మాల్‌ జరిగాయని సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో తెలిపింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news