రాజన్న సిరిసిల్ల జిల్లా : వేములవాడ రాజన్న భక్తులకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవాలయం లో ఆర్జిత సేవలు ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఆలయ కమిటీ. మహా రుద్రాభిషేకం 600 నుండి వెయ్యి రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది వేముల వాడ రాజన్న ఆలయ కమిటీ.
అలాగే… అన్న పూజ 600 నుండి 1000 రూపాయలకు పెంచింది. అటు అభిషేకం 200 రూపాయల నుండి 500 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది వేముల వాడ ఆలయ కమిటీ. సత్యనారాయణ వ్రతానికి 400 నుండి 600 కి పెంచుతూ.. నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు.. కుంకుమ పూజ 150 రూపాయల నుండి 300 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆలయ కమిటీ. కరోనా తర్వాత.. భక్తుల సంఖ్య బాగా పెరిగిందని… అలాగే.. ఆలయ అభివృద్ధి కోసం టికెట్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది ఆలయ కమిటీ. అయితే.. ధరలు పెంచడం పై రాజన్న భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో ఇలా పెంచడమేంటని ప్రశ్నిస్తున్నారు.